టాలెంట్ ఉందా,ఏడు కోట్ల ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి

By Gizbot Bureau
|

భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. గత పదేళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఐటీ సెక్టార్‌లో ఎక్కువ వేతనం ఇస్తున్న కారణంగా ఉద్యోగులు వెంటనే వేరే కంపెనీలకు మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలెంట్ ఉన్నవారిని బయటకు పంపిస్తే మళ్లీ అలాంటివారు దొరకడం కష్టమని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.

IT companies go all out to stop attrition of skilled young staff

కొత్త వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికీ, ట్రైనింగ్ ఇవ్వడానికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతోందనీ, దీంతో పాటు టైమ్ కూడా చాలా వేస్ట్ అవుతుందనీ, ఆ ప్రభావం కంపెనీ పెర్ఫార్మెన్స్‌పై పడుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ అట్రిషన్ రేటు సాధించేందుకు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది.

 టాలెంట్ ఉంటే కోరింది మీ సొంతం

టాలెంట్ ఉంటే కోరింది మీ సొంతం

హై అట్రిషన్ రేటు సాధిస్తున్న కంపెనీలు తమ సంస్థలో హై-పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఉద్యోగులను బయటకు వెళ్లకుండా వారు అడిగింది ఇస్తూ కాపాడుకుంటున్నాయి. కొత్తగా వచ్చే యంగ్ ఉద్యోగులను సంస్థలోకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కంపెనీ వీడకుండా ఉండేందుకు యాజమాన్యాలు టాప్ టాలెంటీర్లకు శాలరీలను పెంచుతున్నాయి. ప్రమోషన్లు, బోనస్‌లూ ఇస్తున్నాయి.

3 నుంచీ 7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు

3 నుంచీ 7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు

వారి కెరీర్ మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు వారికే రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తంగా ఐటీ పరిశ్రమ మొదటి క్వార్టర్‌లో 1 శాతం ఎక్కువ అట్రిషన్ రేటు చూపించింది. ఇందుకు కారణం ఉన్న ఉద్యోగులు కొత్త స్కిల్స్ నేర్చుకొని టాలెంట్ పెంచుకోవడం, ఐటీ సంస్థలు టైయర్ 2 సిటీలకు కూడా విస్తరిస్తుండటమే. 3 నుంచీ 7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. వారికి ఎక్స్‌పీరియన్స్‌తోపాటూ ప్రీమియం స్కిల్స్ ఉంటున్నాయి.

ఎక్కువ అట్రిషన్ రేటు కలిగిన కంపెనీలు

ఎక్కువ అట్రిషన్ రేటు కలిగిన కంపెనీలు

టాప్ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ మొదటి క్వార్టర్‌లో ఎక్కువ అట్రిషన్ రేటు కలిగివున్నాయి. కాగ్నిజెంట్ అట్రిషన్ రేటు 19 శాతం నుంచీ 23 శాతానికి పెరిగింది. ఇన్ఫోసిస్ రేటు 20.4 నుంచీ 23.4 శాతానికి పెరిగింది. విప్రో రేటు 16 నుంచీ ఒక శాతం పెరిగి... 17.6 శాతానికి చేరింది. ఇలాంటి పరిస్థితుల మధ్య హై పెర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ల శాలరీలు 30 నుంచీ 40 శాతం దాకా పెరుగుతున్నాయి.

 మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు

మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు

ఇదిలా ఉంటే రానున్న ఐదున్నర ఏళ్లలో, అంటే 2025 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయగా, ఏయే రంగాల్లో పెరుగుతాయో పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైపుణ్యం ఉన్న సాంకేతిక సిబ్బందే కాకాండా రెండు భాషలు, మూడు భాషలు వచ్చి, వాటిపై సరైన పట్టు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ భాషా ప్రవీణుల్లో మహిళలే ఎక్కువ చేరే అవకాశం ఉందని భారత ఐటీ రంగానికి చెందిన ‘నాస్కామ్' అధ్యక్షులు దేబ్జాని ఘోష్ చెప్పారు.

ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం

ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషకులు, మొబైల్ టెక్, రోబోటిక్, వర్చువల్ రియాలిటీ, త్రీ డీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఉంటాయని ఘోష్ అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో ఉద్యోగులు వివిధ పాత్రలు పోషించాల్సి ఉన్నందున, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం అవుతుందని ఆమె అన్నారు. అయితే ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం అవుతారని, అయితే నైపుణ్యం కలిగిన వారు అంతమంది అందుబాటులోని లేరని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అభిప్రాయపడింది. పది టెక్నాలజీ సంస్థల్లో 55 రకాల జాబులు నిర్వహించాల్సి ఉంటుందని, కొరతను ముందుగానే ఊహించిన భారత్, ఆ దిశగా కొత్త నైపుణ్యాభివద్ధికి కషి చేస్తోందని కూడా ఫోరమ్ ప్రశంసించింది.

Best Mobiles in India

English summary
IT companies go all out to stop attrition of skilled young staff

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X