ఆధార్-పాన్ లింకింగ్ గడువును మళ్ళీ పొడగించిన ITశాఖ
ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించే గడువు తేదీను మరోసారి పొడిగించింది. ఇంతకు మునుపు దేని యొక్క చివరి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2019 వరకు ఉన్నది. తరువాత ఈ గడువు తేదీని డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించబడింది.

ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడం
కానీ ఇప్పుడు తాజాగా ఈ గడువును మరోసారి మూడు నెలల వరకు అంటే మార్చి 31, 2020 వరకు పొడిగించారు. ఈ గడువు తేదీలో మీరు ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడంలో విఫలమైతే కనుక మీ ITR (ఆదాయపు పన్ను రిటర్న్) లభించడం తిరస్కరించబడుతుంది. అలాగే పాన్ కార్డ్ పనిచేయదు.
The due date for linking of PAN with Aadhaar as specified under sub-section 2 of Section 139AA of the Income-tax Act,1961 has been extended from 31st December, 2019 to 31st March, 2020.
— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2019
Notification no.107 of 2019 dated 30/12/2019 issued by CBDT.
ఇక్కడ ‘పనిచేయదు' అంటే వ్యక్తి పాన్ కలిగి ఉండడని అర్థం. దీని అర్థం వినియోగదారుడు ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేకపోవచ్చు. గడువు తేదీ యొక్క పొడిగింపు వార్తలను ఐ-టి విభాగం ట్వీట్ చేసింది. డాక్యుమెంట్ లలో కొన్ని లోపాల కారణంగా లింక్‌ను ఇంకా పూర్తి చేయని వారికి ఈ పొడగింపు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఇంకా మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే కింద తెలిపే పద్దతులను అనుసరించండి.

ఆధార్-పాన్ లింకింగ్
లింకింగ్ ప్రాసెస్ కోసం మీకు 12-అంకెల నెంబర్ ఉన్న మీ ఆధార్ కార్డు అవసరం. దీనితో పాటు 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబర్ గల మీ పాన్ కార్డ్ కూడా అవసరం. అలాగే మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యాక్సిస్ కోసం OTP పంపబడుతుంది. ఇవన్నీ మీకు లభించిన తర్వాత మీరు లింకింగ్ చేయడానికి ముందుకు సాగవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా లింక్ చేయవచ్చు
లింక్ చేయడానికి మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయకపోతే మొదటగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ (incometaxindiaefiling.gov.in) లో నమోదు చేసుకోవాలి. మీకు ఇప్పటికే అకౌంట్ ఉంటే మీ ఐడి, పాస్‌వర్డ్ మరియు పుట్టిన తేదీతో పోర్టల్‌లో సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ అయిన తరువాత పాప్-అప్ విండో కనిపిస్తుంది. ఇది మీ ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించడానికి మీకు సహాయపడుతుంది.

ఒకవేళ మీరు విండోను చూడలేకపోతే మీరు మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అందులోని సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి అందులోని లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్‌పై కనిపించే వివరాలను ధృవీకరించండి. మీ ఆధార్ నంబర్‌ను దాని యొక్క స్థానంలో నింపండి తరువాత ‘లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేయండి. యాక్సిస్ కోసం మీ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. మీ యొక్క వివరాలు సరిగ్గా ఉంటే కనుక లింకింగ్ విజయవంతంగా జరుగుతుంది.

SMS ఉపయోగించి లింక్ చేయడం
SMS ఉపయోగించి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి UIDPAN అని టైప్ చేసిన తరువాత మీ యొక్క 12-అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేయండి. దాని తరువాత స్పేస్(ఖాళీ) ఇచ్చిన తర్వాత మీ యొక్క10-అంకెల పాన్ నంబర్‌ను టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తరువాత దానిని 567678 లేదా 56161 కు SMS పంపండి. ఉదాహరణకు UIDPAN 123456781234 ANWP1234AN . ఇక్కడ 123456781234 అనేది - ఆధార్ నెంబర్ మరియు ANWP1234AN అనేది - పాన్ నెంబర్.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి ఈ SMS పంపించాల్సి ఉంటుందని గమనించండి. లింకింగ్ విజయవంతం అయిన తర్వాత దాని గురించి మీకు SMS తో తెలియజేయబడుతుంది.


Click it and Unblock the Notifications








