ఐటీ రంగంలో టాలెంట్‌ ఉన్న వారికి 20 శాతం వరకు పెరుగుదల

Posted By: Super

ఐటీ రంగంలో టాలెంట్‌ ఉన్న వారికి 20 శాతం వరకు పెరుగుదల

ఐటీ రంగంలో నిపుణులైన ఉద్యోగుల కొరత కారణంగా వేతనాలు పెంచే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని త్రైమాసికాలలో ఐటి ఉద్యోగుల వలసలు ఎ క్కువ కావడం .. డిమాండ్‌... సప్లయ్‌లో తేడా రావడం తో జీతాలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐటి నిపుణు లు పేర్కొంటున్నారు. ఐటీ రంగంలో టాలెంట్‌వారు కొనసాగుతోంది. అను భవజ్ఞులైన ఉద్యోగులకు బోలెడన్ని అవకాశాలు వెతు క్కుంటూ వస్తున్నాయి. ఇక ఎలాంటి కంపెనీలను ఎంపిక చేసుకోవాలో వారి చేతిలో ఉంది. దానికి తగ్గట్టు కంపెనీ లు కూడా మంచి టాలెంట్‌ ఉన్న ఉద్యోగుల వేటలో పడింది. నిపుణులైన ఉద్యోగులు దొరికితే వారిక ఎంత జీతం చెల్లించడానికి కూడా ఈ కంపెనీలు వెనకాడ్డంలేదు. ఉద్యోగులకు మంచి జీతాలిస్తామంటూ గాలం వేస్తున్నా యి. పనిచేస్తున్న కంపెనీ గుడ్‌బై చెప్పి తమ సంస్థలో చేర మని వారిని ప్రోత్సహిస్తుంటాయి.

ఈ ఏడాది ఐటి రంగంలో జీతాలు బాగానే ఉండే అవ కాశం కనిపిస్తోంది. 15-25 శాతం వరకు పెరిగే అవకా శం కనిపిస్తోంది. మంచి టాలెంట్‌ ఉన్న ఉద్యోగులకు 30-45 శాతం వరకు పెంచేందుకు వెనకాడ్డం లేదు. ఐటీ రీసోర్సెస్‌ డైరెక్టర్‌ బీ ఎన్‌ తమ్మయ్య మాట్లాడు తూ... ఈ ఏడాది ఐటీ రంగంలో 10-15 శాతం వేతనా లు పెరిగే అవకాశం ఉందని... మంచి టాలెంట్‌ ఉన్న వారికి 20 శాతం వరకు పెరుగుదల ఉంటుందన్నారు.ఐటి నిపుణుల ప్రకారం పెరిగిన జీతాలు కొన్ని నెలల పాటు అలానేకొనసాగుతాయి. ఎందుకంటే తీసుకున్న ప్రాజెక్టుల డెలివరీకి ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులైన ఉద్యోగులతోనే పూర్తి చేశారు.అయితే అందరు ఉద్యో గులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయంటే పప్పు లు కాలేసినట్లే.. పనిలో మంచి నైపుణ్యం చూపించిన వారికే ఈ అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి 8-10 శాతం మేర పెరుగుదల ఉంటుందని వారు వివరించారు.

అంతర్జాతీయ పరిణామాల ప్రకారం చాలా మటుకు భారతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఆదాయం 15-20 వరకు తగ్గుతుందని... ప్రస్తుతం 25-30 శాతం వరకు ఆదా యం తగ్గుదల ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చిపడు తున్నాయి.ఐటీ రంగంలో వలసల తాకిడి ఎక్కువైంది. ఇక్కడ రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఒక ఐటీ నిపుణు డు మారుతున్న కాలాన్ని బట్టి తన వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. లేదంటే అతడు లేదా ఆమె మార్కెట్‌లో వెనుకబడిపోయినట్లు భావించాల్సి ఉంటం ది. ఐటి నిపుణులు ఉద్యోగాలు మార్చకుంటే వారికి లెటెస్టు టెక్నాలజీలో వెనుకబడి పోతారు. వారినంతా ఔట్‌డెటెడ్‌గా పరిగణిస్తారు. ఇదే సూత్రం కంపెనీలకు వర్తిస్తుంది. వారు కూడా మార్కెట్‌ను బట్టి కొత్త కొత్త ఆలోచనలతో ముందు వెళ్లి మార్కెట్‌ను సాధ్యమైనంత వరకు చేజిక్కించుకోవాలి. లేదంటే వారు వెనుకబడి పోయినట్లే నని ఐటి విశ్లేషకులు చెబుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot