ఐటీలో 85 వేల ఉద్యోగాల నియామకం,మరిన్ని ఉద్యోగాలకు సై

By Gizbot Bureau
|

భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ కొత్తగా దాదాపు 85 వేల మందిని నియమించుకుంది.గత ఆరేళ్లలో ఒక త్రైమాసికంలో కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఈ స్థాయిలో ఉండడం రికార్డు అని ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్ఏ తెలిపింది.

IT industry on hiring spree, adds record number of employees in Q1

హెచ్‌1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆయా దేశాల్లోనే కంపెనీలు ఆ దేశాలకు చెందిన నిపుణులను తీసుకుంటున్నాయి. దీంతో భారీ మొత్తంలో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

 మరింత మంది ఉద్యోగులు అవసరం

మరింత మంది ఉద్యోగులు అవసరం

భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల వల్ల మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారని.. అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంలో ఐటీ కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హెచ్‌1 బీ వీసా నిబంధనలు కఠినం కావడంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆయా దేశాల్లోనే కంపెనీలు నిపుణులను నియమిస్తున్నాయి. ఈ నియామకాలకు ఇక్కడ చేపట్టిన నియామకాలు కన్నా అదనం.

 టీసీఎస్‌ 12,356 మందికి ఉద్యోగాలు

టీసీఎస్‌ 12,356 మందికి ఉద్యోగాలు

2012-13 తొలి త్రైమాసికంలో పరిశ్రమ కొత్తగా దాదాపు 50 వేల మంది నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చిందని సీఎల్‌ఎ్‌సఏ వెల్లడించింది. 2013-14 చివరి త్రైమాసికానికి ఇది దాదాపు 38 వేలకు తగ్గింది. 2015-16 తొలి త్రైమాసికంలో 70 వేల మంది స్థాయికి చేరింది. ఆ తర్వాత 2017-18 తొలి త్రైమాసికంలో 10 వేల మందికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ 12,356 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.

సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు
 

సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు

గత అయిదేళ్లలో ఒక త్రైమాసికంలో కంపెనీ ఇచ్చిన అత్యధిక ఉద్యోగాలు ఇవేనని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది . 30,000 మందికి పైగా ఫ్రెషర్లకు జాయినింగ్‌ లెటర్లు ఇచ్చామని.. ఇందులో తొలి త్రైమాసికంలో 40 శాతం మంది కంపెనీలో చేరారని టీసీఎస్‌ వెల్లడించింది. అదే విధంగా తొలి త్రైమాసికంలో విప్రో 3,425 మంది నిపుణులను తీసుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 5,935 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది.

ఇన్ఫోసిస్‌

ఇన్ఫోసిస్‌

ఇదిలా ఉంటే తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ.. బయటకు వెళ్లిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. నికరంగా ఇచ్చిన ఉద్యోగాలు 908 మాత్రమే. డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలున్న వారిని ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
IT industry on hiring spree, adds record number of employees in Q1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X