పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు 14 శాతం

Posted By: Super

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు 14 శాతం

న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), హెల్త్‌కేర్‌ రంగంలో ఎక్కువగా వలసలున్నట్లు ఒక సర్వేలో తేలింది. ఈ రంగానికి చెందిన నిపుణులైన ఉద్యోగులు మంచి అవకాశాలు దొరికితే ఉన్న కంపెనీ వదిలి కొత్త సంస్థలో చేరేందుకు సిద్ధంగా ఉంటారు. మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన సంస్థల్లోనే ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉన్నాయని 2010-11లో మొదటి ఆర్థిక సంవత్సరంలో 23 శాతం వరకు ఉన్నట్లు తేలింది. దీనితో పోల్చుకుంటే బ్యాంకింగ్‌ - ఫైనాన్షియల్‌ రంగంలో 18 శాతం, తర్వాత హెల్త్‌కేర్‌ రంగం 12 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగం 11 శాతం, ఆటోమొబైల్‌ రంగం 11 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఆకర్షణీయమైన పే ప్యాకేజీలు (21) శాతం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు (16) శాతం, పై అధికారులతో అసంతృప్తి (15) శాతం, పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు (14) శాతంగా ఉన్నారని కుమార్‌ వివరించారు. ఉద్యోగుల్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో వలసలు 39 శాతం కాగా. 5-10 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో 27 శాం మంది.. 10-15 శాతం అనుభవం ఉన్నవారిలో 22 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేటతెల్లమయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 15 ఏళ్లు ఆపైన అనుభవం ఉన్నవారు మాత్రం వలసలకు చాలా తక్కువగా 15 శాతం ఉంటున్నాయి.

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఏంట్రీలెవెల్‌ యువకులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి తమ కోరికలను తీర్చుకోవాలని జీవితంలో తొందరగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ వారు అదే ఉద్యోగంలో కొనసాగితే వారి వేతనం 10-20 శాతం వరకు మాత్రం పెరిగే అవకాశం ఉంది. అదే కొత్త ఉద్యోగంలోకి చేరితే వారి వేతనాలు 25-40 శాతం వరకు పెరుగుతుంది. ఉద్యోగులు పెద్ద ఎత్తున వలసలు వెళ్లటం వల్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కొత్తగా మళ్లీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల వారికి హెచ్చు జీతాలు చెల్లించి తీసుకోవాల్సివస్తోంది. హై హైరింగ్‌ క్లబ్‌ ఈ సర్వేను ఆసియా, గల్ఫ్‌/మధ్యప్రాచ్య దేశాల్లో నిర్వహించింది. మొత్తం 18,000 మంది ఉద్యోగులు 249 మంది యజమానులను ఈ ఏడాది మే జూన్‌ నెలలో సర్వే నిర్వహించింది.

భారత్‌లో ఉద్యోగుల వలసలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల వలసలు ఎక్కువగానే ఉన్నాయని దీనికి ప్రధాన కారణం నిపుణులైన ఉద్యోగులకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చి ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు మళ్లీ కొత్త ఉద్యోగుల వేట ప్రారంభించాల్సి వస్తోంది. వలసలకు వేతనాలు ఒక కారణమైతే... మరో కారణం ప్రమోషన్లు కూడా కారణమని మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌కామ్‌ సీఈవో రాజేష్‌కుమార్‌ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot