దేశ వ్యాప్తంగా ఉచిత వైఫై, ప్లాన్ చేస్తున్న కేంద్రం

By Gizbot Bureau
|

దేశంలో ఇంటర్నెట్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు.

‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌
 

‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్‌ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి'' అని మంత్రి వెల్లడించారు.

గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?

ఆన్‌లైన్‌ వేదికగా

ఆన్‌లైన్‌ వేదికగా

ఇదిలా ఉంటే భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్‌లైన్‌ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే-జూలైతో పోలిస్తే ఆగస్టు-అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్‌ నివేదిక చెబుతోంది.

Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?

కొత్త కస్టమర్లకు మొబైల్స్‌ తొలి ప్రాధాన్యత

కొత్త కస్టమర్లకు మొబైల్స్‌ తొలి ప్రాధాన్యత

10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్‌లైన్‌ కస్టమర్ల షాపింగ్‌ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్‌ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు-25 అక్టోబరు మధ్య ఫెస్టివ్‌ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్‌ వాటా ఏకంగా 53% ఉంది.

జియో ప్రివ్యూ యూజర్లు మైగ్రేషన్ ప్లాన్‌లోకి మారిపోవచ్చు

ఇవే కొనుగోళ్లు
 

ఇవే కొనుగోళ్లు

మొబైల్స్‌ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్‌ సీజన్లో ప్రైమ్‌ టైంలో అంటే రాత్రి 8-11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్‌ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్‌ నమోదైంది.

మూడు నాలుగు రెట్ల అమ్మకాలు

మూడు నాలుగు రెట్ల అమ్మకాలు

పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్‌ డే సేల్‌ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్‌ పీరియడ్‌ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్‌ సీజన్‌ తొలి వారంలో 43 శాతం సేల్స్‌ జరిగాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
IT Minister Ravi Shankar Prasad Announced All Villages to Get Free WiFi Services in March 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X