ముకేశ్‌ అంబానీ vs సునీల్ మిట్టల్‌, జీవాటాను సొంతం సొంతం చేసుకునేదెవరు ?

దేశంలో బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్‌టె​ల్‌ ఛైర్మన్‌ సునీల్ మిట్టల్‌ మధ్య మళ్లీ సరికొత్త వార్ కి తెరలేచింది. ఈ దిగ్గజాలిద్దరూ ప్రము

|

దేశంలో బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్‌టె​ల్‌ ఛైర్మన్‌ సునీల్ మిట్టల్‌ మధ్య మళ్లీ సరికొత్త వార్ కి తెరలేచింది. ఈ దిగ్గజాలిద్దరూ ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ వాటాలపై కన్నేసినట్లు వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. దేశీయ బిలియనీర్లు ముకేశ్‌ అంబానీ, సునీల్‌ మిట్టల్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

 
ముకేశ్‌ అంబానీ vs సునీల్ మిట్టల్‌, జీవాటాను సొంతం సొంతం చేసుకునేదెవరు ?

ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ తాజాగా పేర్కొంది. త్వరలోనే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్‌ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్‌ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్‌ చేసింది.

జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ముందుకు..

జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ముందుకు..

ఇప్పటికే జీ వాటా కోసం భారతీ ఎయిర్‌టెల్ చర్చలు ప్రారంభించింది. త్వరలో ఓ ప్రతిపాదననూ జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించిన రిలయన్స్ జియో కూడా జీవాటాల కొనుగోలు అంశాన్ని సీరియస్ గానే పరిశీలిస్తోంది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర కొంతమేర వాటాను విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన విషయం సంగతి తెలిసిందే. మరోపక్క నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో సంస్థను బలోపేతం చేసేందుకు వ్యహాత్మక భాగస్వామి కోసం వెతుకుతోంది.

 

 

173 దేశాల్లో 130 కోట్ల మంది వీక్షకులు

173 దేశాల్లో 130 కోట్ల మంది వీక్షకులు

భారీగా రుణాల ఊబిలో చిక్కుకున్న జీ గ్రూపు టీవీ చానెళ్లకు 173 దేశాల్లో 130 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. 78 చానెళ్లు, 4800 మూవీ టైటిళ్లతో ముందు వరుసలో ఉంది జీ గ్రూప్. దీని కొనుగోలు కోసం సోనీ గ్రూప్, కంకాస్ట్ సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి. అయితే ఒప్పందం ఖరారయ్యే వరకు ఈ చర్చలు వెళ్లలేదు.

ఎయిర్‌ టెల్‌ 4.6బిలియన్‌ డాలర్లను..
 

ఎయిర్‌ టెల్‌ 4.6బిలియన్‌ డాలర్లను..

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే భారతీ ఎయిర్‌ టెల్‌ 4.6బిలియన్‌ డాలర్లను రైట్స్‌ ఇష్యూ రూపంలో సమీకరించి నిధులను సిద్ధం చేసుకొన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది భారతీ సంస్థ జీతో ఒప్పందం కూడా చేసుకొంది. జీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడంతో తమ టెలికం, కేబుల్ బిజినెస్ పెంచుకోవచ్చునని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ

ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్‌ కంపెనీలైన ఏటీఅండ్‌టీ, వొడాఫోన్‌, కేడీడీఐ కార్ప్‌ కూడా సినీ, టెలివిజన్‌ సంస్థలను కొనుగోలు చేయడంతోపాటు, టీవీ రంగ ఆస్తులను కూడా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు భవిష్యత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ పడనున్నాయి.

అధికారికంగా...

అధికారికంగా...

అటు రిలయన్స్ జియో యాజమాన్యం అధికారికంగా జీ న్యూస్ షేర్ల కొనుగోలుపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. వాటా కొనుగోలు రేసులో ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌ ఉన్నాయన్న వార్తలపై ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఈ ఊహాగానాలను ఎయిర్‌టెల్‌ ప్రతినిధి తిరస్కరించారు. జీలో వాటాల కొనుగోలు రేసులో ఎయిర్‌టెల్‌ లేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు.

 జీ ప్రతినిధి స్పందిస్తూ..

జీ ప్రతినిధి స్పందిస్తూ..

దీనిపై జీ ప్రతినిధి స్పందిస్తూ కంపెనీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదని తెలిపారు. ప్రస్తుతం దీనిపై బలమైన భాగస్వాములతో చర్చలు జరుపుతామని మాత్రం పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం 5జీ వేవ్స్ కోసం వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
It's Mukesh Ambani vs Sunil Mittal for stake in Zee entertainment: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X