త్వరలో ఐటీ పరిశ్రమలో అత్యధిక ఉద్యోగవకాశాలు

Posted By: Super

త్వరలో ఐటీ పరిశ్రమలో అత్యధిక ఉద్యోగవకాశాలు

న్యూఢిల్లీ: మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌ కమ్‌ చేసిన ఈ సర్వేలో ఈ నెల (జూలై) నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అన్ని కీల క రంగాల్లో 52 శాతం ఉద్యోగుల భర్తీ జరగనుందని తేలిపింది. 2010లో పారిశ్రామికరంగం కేవలం 39 శాతం ఉద్యోగ వకాశాలనే కల్పించిందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఇంతకంటే అధికంగా ఉద్యోగులను నియమించుకోవాలను కుంటున్నాయని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఆశాజనకంగా వృద్ధిరేటును నమోదు చేస్తున్న ఐటీ రంగమే అత్యధి కంగా ఉద్యోగవకాశాలు ఇవ్వనుందని మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌ కమ్‌ వ్యవస్థాపకుడు, సంస్థ సీఈఓ రాజేష్‌ కుమార్‌ తెలిపారు.

దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 786 మేనేజిం గ్‌ డైరెక్టర్లతోపాటు 1426 రిక్రుట్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ను సంప్రదించి తమ సర్వేను రూపొందించామని రాజేష్‌ కుమార్‌ వివరించారు. అయితే పారిశ్రామికరంగంలో చోటుచేసుకుంటున్న వృద్ధిరేటుపై ఇటీవల విడుదలైన గణాంకాలు సైతం తాజా సర్వేకు అద్దం పడుతుండటం గమనార్హం. ఈ క్రమంలోనే గత వైభవాన్ని తిరిగి సంతరించుకుం టున్న ఐటీ రంగంతోపాటు ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆర్థిక సేవలు, ఆటోమెబైల్‌, తయారీ, టెలికాం రంగాలు ఉద్యోగ నియామ కాలను చేపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది.

ఇదే సమయంలో కీలకమైన ఐటి రంగంలోనూ వ్యాపార సంక్షోభం నడుస్తుండటంతో పారిశ్రామికరంగం అభివృద్ధి మందగించింది. ఫలితంగా ఆయా రంగాల్లోని పరి శ్రమలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా ఐటీ రంగంలోని సంస్థలు సగానికి పైగా ఉద్యోగ భారాన్ని తగ్గించుకున్నాయి. అయితే తాజాగా అన్ని రంగాల్లో వ్యాపారవకాశాలు మెరుగుపడుతుండటంతో సామర్థ్యానికి తగ్గ శ్రామిక శక్తిని పెంచుకోవాలని పరిశ్రమలు నిర్ణయించా యి. ఈ నేపథ్యంలోని రానున్న మూడు త్రైమాసికాల్లో పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టేందుకు ఆయా సంస్థలు సంసి ద్ధులవుతున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమే అత్యధికంగా ఉద్యోగవకాశాలను కల్పించనుంది. పారిశ్రామికరంగంలోని వివిధ రంగాల పరిశ్రమలు చేపట్టే ఉద్యోగ నియామకాలను పరిశీలిస్తే..ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి చివరాఖరి వరకు గతేడాది కంటే ఈసారి ఐటీ పరిశ్రమ 32 శాతం ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. ఆ తర్వాతి స్థానంలో ఎఫ్‌ఎమ్‌సీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) రంగం 21 శాతం ఉద్యోగులను పెంచుకోనుంది. ఇదే క్రమంలో ఆర్థిక సేవల రంగంలోని బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సంస్థలు 19 శాతం ఉద్యోగులను, ఆటోమొబైల్స్‌, తయారీ రంగాలు 14 శాతం చొప్పున, టెలికాం రంగం 12 శాతం మేర ఉద్యోగవకాశాలను ఇవ్వనున్నాయని సర్వే ప్రకారం తెలిసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot