Just In
- 37 min ago
Amazon App ఉందా..? ఈ క్విజ్ లో పాల్గొని Rs.10000 ప్రైజ్ మనీ గెలుచుకోండి.
- 1 hr ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 1 hr ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
- 1 day ago
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
Don't Miss
- Automobiles
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
- Movies
బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు
- News
దారుణం.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో గాజు గ్లాసుతో చిత్రహింసలు...
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ గురి
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వేల ఉద్యోగాలతో ఐటీ రంగం పిలుస్తోంది,ఈ స్కిల్స్ కావాలి
దేశంలో వివిధ రంగాల సంస్థలు టెక్నాలజీకిచ్చే ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఐటీ/సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన కొనసాగనుందని తెలుస్తోంది. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ షైన్‌డాట్‌కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిపిన నియామకాలను అలాగే అంతక్రితం నెలతో పోలుస్తూ తయారు చేసిన నివేదిక ప్రకారం ఉద్యోగాలను అందింే రంగంలో బీపీవో/కాల్ సెంటర్ పరిశ్రమ వెనుకబడింది. దీంతో రెండో స్థానంలోకి తయారీ రంగం చేరింది. పెరిగిన ఉద్యోగాల కల్పనతో బీఎఫ్‌ఎస్‌ఐ, విద్యా శిక్షణ రంగాలు టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్నాయి.ఉత్పత్తి, నిర్వహణ, సేవల రంగాలు కూడా ఉపాధిలో గణనీయంగా వృద్ధి సాధించినట్లు షైన్‌డాట్‌కామ్ సీఈవో జైరస్ మాస్టర్ చెప్పారు.
అలాగే అత్యధికంగా ఉద్యోగాలిచ్చే పరిశ్రమల్లో ఆతిథ్య రంగం కూడా చోటు దక్కించుకుందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో పొందుపరిచన సమాచారం ప్రకారం మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్స్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్ ఆఫీస్, సెక్రటరీ, హెచ్‌ఆర్ విభాగాల్లో ఉద్యోగాల కల్పన మందగించింది. అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన నగరాల జాబితాలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.

సీవీ వెరీ ఇంపార్టెంట్:
సీవీ అనగానే చాలామంది నామ్ కే వాస్తు ఇస్తుంటారు. కానీ.. అలాకాకుండా సీవీలో ప్రతీ విషయాన్ని మెన్షన్ చేస్తూ.. మనగురించి పూర్తిగా తెలిపేదిగా ఉండాలి. లేనిపోనివి అందులో యాడ్ చేయకూడదు. మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. రానివి అసలు యాడ్ చేయవద్దు

లుకింగ్:
చూడగానే మంచి ఇంప్రెషన్ కలిగితే మనం 50శాతం సక్సెస్ అయినట్టే. అందుకే డ్రెస్సింగ్, ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. ఇంటర్యూ సమయంలో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎదురుగా కూర్చుని ప్రతీ దానికి నవ్వుతూ సమాధానం ఇవ్వాలి. అంతే కాని విసుగు లాంటివి ప్రదర్శించకూడదు.

అడిగిన ప్రశ్నలకే జవాబువ్వడం:
చాలా మంది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకే కాకుండా అన్నింటికీ సమాధానాలు చెబుతుంటారు. అలా కాకుండా అడిగిన వాటికే సమాధానం ఇస్తే సరిపోతుంది. ఇంప్రెస్ కోసం లేనిపోనివి కల్పించి చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల మైనస్ అయ్యే అవకాశం ఉంది.

సోషల్ మీడియాపై అవగాహన:
ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. జాబ్ విషయంలో ఇది చాలా ముఖ్యం.అవగాహన ముఖ్యం: మనం ఏ జాబ్‌కి వెళ్తున్నాం.. అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి. సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అనేది ప్రతి రోజు తెలుసుకుంటే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది

ఫాలో అప్:
మనం ఇంటర్వ్యూ అయిన అనంతరం.. అక్కడ్నుంచీ కాస్తా ఫాలో అప్ చేయడం చాలా ముఖ్యం. అసలు అవకాశం ఉందా లేదా.. అనేది తెలుసుకోవాలి.వీలైతే మనం ఏ మిస్టేక్స్ చేశామో కూడా తెలుసుకుంటే మరో సారి అలాంటి తప్పులు చేయకుండా మ్యానేజ్ చేయవచ్చు.

జనరల్ అవేర్‌నెస్
సబ్జెక్టు పుస్తకాలతో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనే స్ఫృహ కూడా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రధాన పరిణామాలపై ఓ కన్నేసి ఉంచడం ద్వారా ఐక్యూను పెంచుకోవాలి. రోజూ న్యూస్‌పేపర్ చదవడం, న్యూస్ చానెళ్లు చూసి తాజా పరిణామాలను తెలుసుకోవడం, వాటిని తోటివారితో విశ్లేషించడం ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.

అనలిటికల్ స్కిల్స్
ఇవి తరగతి గదిలో నేర్పేవి కాదు. ఎవరికివారే స్వయంగా ఈ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో రాణించడానికి చక్కటి విశ్లేషణ సామర్థ్యం అవసరం. సమస్య ఎదురైన సందర్భాల్లో తడబాటుకు లోనవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కంపెనీలకు చెడ్డపేరు రావడంతోపాటు ఒక్కోసారి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సముచితంగా స్పందించడం, వివేకంతో ఆలోచించడం అవసరం. సమస్యను ఆమూలాగ్రం విశ్లేషించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ కంప్యూటర్‌కి సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరి. ఇంటర్వ్యూకు వెళ్లేముందే అభ్యర్థులు ఆయా విభాగాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లపై పట్టు సాధించాలి. అవసరమైతే ముందస్తుగా శిక్షణ తీసుకోవాలి. బేసిక్స్‌తోపాటు ఈమెయిల్, ఇంటర్నెట్, సెర్చ్ ఇంజన్ల వాడకం మొదలైనవాటిపై అవగాహనతో ఉండాలి.

సాఫ్ట్ స్కిల్స్
విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం ఉద్యోగం సంపాదించడానికి సరిపోతాయి. కానీ, దాన్ని నిలబెట్టుకోవడానికి, తోటివారి కంటే వేగంగా ఎదగడానికి సాఫ్ట్ స్కిల్స్ అవసరమవుతాయి. క్లయింట్లతో సమావేశాల్లో పాల్గొనడం, కంపెనీ ఉత్పత్తుల గురించి వారికి అర్థమయ్యేలా వివరించి, మెప్పించడం, టీమ్‌ను ముందుండి నడిపించడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వంటి లక్షణాలు ఉన్నవారి కెరీర్ ఆటుపోట్లకు లోనుకాకుండా సాఫీగా సాగిపోతుంది. భావవ్యక్తీకరణ నైపుణ్యం, నిజాయితీ, కలిసిపోయే తత్వం, భావోద్వేగాల నియంత్రణ, తోటివారి అభిప్రాయాలను గౌరవించడం మొదలైన నైపుణ్యాలను పెంచుకోగలగాలి.

కమ్యూనికేషన్ స్కిల్స్
చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం, నవ్వుతూ మాట్లాడటం, ఎదుటివారు చెప్పేదాన్ని శ్రద్ధగా వినడం వంటి లక్షణాలు అభ్యర్థులకు ఉండాలని రిక్రూటర్లు ఆశిస్తున్నారు. చక్కటి భావవ్యక్తీకరణ నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడమే మహాభాగ్యం అన్నట్టుగా ఎగరేసుకు పోతున్నారు. ఆత్మవిశ్మాసం, విషయాన్ని భావం చెడకుండా చెప్ప/రాయగలిగేంతగా భాషపై పట్టు, చక్కటి పదప్రయోగం వంటి లక్షణాలు అభ్యర్థి ప్రొఫైల్ స్థాయిని అమాంతం పెంచేస్తాయి. ఇలాంటివారికి డిమాండ్‌తోపాటు మంచి వేతనాలు కూడా దక్కుతున్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190