Home
News

రూ.6399 ధరకే మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, స్మార్ట్‌ ఏఐ అసిస్టెంట్‌, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఐటెల్‌ సంస్థ ఈ సంవత్సరం మే నెలలో ఐటెల్‌ A90 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే తాజాగా ఐటెల్ A90 లిమిటెడ్‌ ఎడిషన్‌ను (itel A90 Limited Edition Smartphone) విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా మాత్రమే ఉంటుందని ఐటెల్‌ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు.

మిలిటరీ సర్టిఫికేషన్‌తో లిమిటెడ్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ :
ఐటెల్‌ A90 లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.7 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న తొలి మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కలిగిన హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్ MIL STD 810H షాక్‌ రెసిస్టెన్స్‌, IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

itel A90 Limited edition smartphone launched in india

ఐటెల్‌ A90 లిమిటెడ్‌ ఎడిషన్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డైనమిక్‌ బార్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా ఛార్జింగ్, నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు :
ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ Unisoc T7100 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్‌ ర్యామ్ ఫీచర్‌ ద్వారా 8GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. మరియు మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌ పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ఐటెల్‌ A90 లిమిటెడ్‌ ఎడిషన్ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 13MP కెమెరా, LED ఫ్లాష్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు.

5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే రిటైల్‌ బాక్స్‌లో 10W ఛార్జర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 75 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైమ్‌ను పొందవచ్చు. లేదా 35 రోజులపాటు స్టాండ్‌బై టైమ్‌ను పొందుతుందని ఐటెల్‌ చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్మార్ట్‌ ఏఐ అసిస్టెంట్‌ Aivana 2.0 ను కలిగి ఉంది. డాక్యుమెంట్స్‌ ట్రాన్స్‌లేషన్‌, వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్ సపోర్టు, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు DTS సపోర్టుతో స్పీకర్‌ను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఐటెల్‌ A90 లిమిటెడ్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఐటెల్‌ A90 లిమిటెడ్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6399 గా ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6899 గా ఉంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అరోరా బ్లూ, స్టార్‌లిట్‌ బ్లాక్‌, స్పేస్‌ టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
itel A90 Limited edition smartphone launched in india with military grade certification
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X