రూ.7,000లో మరో సంచలన ఫోన్, iTel S41

Posted By: BOMMU SIVANJANEYULU

మొబైల్ ఫోన్‌ అమ్మకాల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న భారత్, అనేక కొత్త బ్రాండ్‌లను వెలుగులోకి తీసుకువస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో కొత్తగా వస్తోన్న బ్రాండ్‌ల సంఖ్య గణీనీయంగా పెరుగుతోంది.

రూ.7,000లో మరో సంచలన ఫోన్, iTel S41

చాలా వరకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు రూ.7000 బడ్జెట్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లను అందిస్తున్నప్పటికి వాటిలో మన్నిక మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ట్రాన్సియన్ హోల్డింగ్స్‌కు తన ఐటెల్ మొబైల్ బ్రాండ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ పాయింట్‌లో ఓ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

iTel S41 పేరుతో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్ ఇమేజింగ్, సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్, బ్యాటరీ బ్యాకప్, మల్టిమీడియా, ప్రొడక్టివిటీ విభాగాల్లో ఆకట్టుకునే పనితీరును కనబరుస్తోంది. రూ.6,999 ధర ట్యాగ్‌లో ఆసాధారణ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌‌ను డబ్బుకు తగ్గ విలువ అనటంలో ఏ మాత్రం సందేహం లేదేమో!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేగవంతమైన ఇంటర్నెట్ కోసం 4G VoLTE సదుపాయం...

కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ మాదిరిగానే ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు కనెక్టువిటీ ఫీచర్స్ అనేవి కూడా చాలా కీలకం. కనెక్టువిటీ ఫీచర్లు బాగుంటేనే వేగవంతమైన కమ్యూనికేషన్ అనేది స్మార్ట్‌ఫోన్ ద్వారా సాధ్యమవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్టువిటీ అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఐటెల్ మొబైల్స్ తన itel S41 స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి కనెక్టువిటీ ఫీచర్లను పొందుపరిచింది. లేటెస్ట్ కనెక్టువిటీ స్టాండర్డ్ అయిన 4G VoLTEతో పాటు వై-ఫై, 3జీ, 2జీ, బ్లుటూత్ వంటి బేసిక్ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

డ్యుయల్ సిమ్ కార్డ్ సౌలభ్యంతో వస్తోన్న ఈ డివైస్‌ను కావల్సిన విధంగా మేనేజ్ చేసుకునే వీలుంటుంది. 4జీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినపుడు అంతరాయంలేని ఇంటర్నెట్ కనెక్టివిటీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది.

సెక్యూర్ మొబైలింగ్ కోసం ఫింగర్‌-ప్రింట్ స్కానర్

itel S41 స్మార్ట్‌ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ఈ ఫింగర్ ప్రింట్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను ఫోన్ యజమాని తప్ప వేరొకరు యాక్సిస్ చేసుకునే వీలుండదు. ఈ బయోమెట్రిక్ స్కానర్ రెప్పపాటు వేగంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసేస్తుంది.

ఈ సెన్సార్‌ చూపుడు వేలుకు అందేవిధంగా ఫోన్ వెనుక కెమెరా క్రింద అమర్చటం జరిగింది. ఈ

స్కానర్‌ను కేవలం సెక్యూరిటీ అవసరాలకు మాత్రమే కాదు ఫోటోలను క్యాప్చుర్ చేసేందుకు, కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు, కాల్స్ రికార్డ్ చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. 5 వేళ్లకు ఐదు రకాల అప్లికేషన్‌లను కాన్ఫిగర్ చేసుకుని వాటిని వేగవంతంగా లాంచ్ చేసుకోవచ్చు.

ప్రీమియమ్ డిజైనింగ్, 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే

itel S41 స్మార్ట్‌ఫోన్‌ మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఈ డివైస్ మరింత సౌకర్యవంతంగా చేతిల్లో ఇమిడిపోతుంది. ఈ ఫోన్ రిమూవబుల్ రేర్ ప్యానల్‌తో వస్తోంది. matte finishను కలిగి ఉన్న ఈ ప్యానల్ పై మరకలు పడేందుకు ఆస్కారం ఉండదు. ఇదే సమయంలో ఫోన్ చేతిలో నుంచి జారే అవకాశం కూడా ఉండదు.

ఈ ఫోన్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ బటన్స్‌ అలానే చార్జింగ్ పోర్ట్స్ కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో కనిపిస్తాయి. 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే రిసల్యూషన్ 1280x 720పిక్సల్స్‌గా ఉంటుంది. స్మూత్ గేమ్‌ప్లేతో పాటు కంఫర్టబుల్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తుంది. స్ర్కీన్ లాక్ పై కనిపించే ఐకాన్స్ మరింత షార్ప్‌గా ఉంటాయి. టెక్స్ట్ క్వాలిటీ మరింత క్రిస్ప్‌గా ఉంటుంది.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అందించే స్మార్ట్‌ఫోన్లు ( రూ. 15 వేల లోపు..)

హై-ఎండ్ ఫీచర్లతో డీసెంట్ కెమెరా క్వాలిటీ..

కెమెరా విషయంలోనూ itel S41 స్మార్ట్‌ఫోన్‌ తన స్థాయికి తగ్గ పనితీరును కనబరుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా క్వాలిటీ ఫోటోలను ఆఫర్ చేస్తోంది. ఈ సెన్సార్ క్యాప్చుర్ చేసే దృశ్యాల్లో డిటైలింగ్‌తో పాటు కలర్ రీప్రొడక్షన్ యక్యురేట్‌గా ఉంటుంది.

ఈ కెమెరా ద్వారా షూట్ చేసిన portrait షాట్స్ సహజసిద్ధంగా కనిపిస్తాయి. ఈ షాట్‌లను క్యాప్చుర్ చేసే సమయంలో కెమెరా సెన్సార్ సబ్జెక్ట్‌ను వేగవతంగా లాక్ చేయగలుగుతుంది.

ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి itel S41 స్మార్ట్‌ఫోన్‌ 8 మెగా పిక్సల్ ఫుల్ - ఫ్రేమ్ కెమెరాతో వస్తోంది. ఫ్లాష్ లైట్ సౌకర్యంతో వచ్చిన ఈ కెమెరా తక్కువ వెళుతురులోనూ కీలక మూమెంట్‌లను క్యాప్చుర్ చేయగలుగుతోంది.

కెమెరా కలర్ బ్యాలన్స్‌ను కస్టమైజ్ చేసుకునే విధంగా పూర్తి-స్థాయి ప్రొఫెషనల్ మోడ్‌ను ఈ కెమెరాలో ఐటెల్ ఏర్పాటు చేసింది. 120 డిగ్రీ పానోరమా షాట్స్‌ను సింగిల్ షాట్‌లో క్యాప్చుర్ చేసుకునే అవకాశాన్ని ఈ కెమెరా కల్పిస్తోంది.

సెల్ఫీలను మరింత అందంగా మలచుకునేందుకు ఫేస్‌బ్యూటీ మోడ్‌తో పాటు డెడికేటెడ్ నైట్ మోడ్‌ను ఈ కెమెరాతో ఐటెల్ ఇన్‌బిల్ట్‌గా అందిస్తోంది. ఈ మోడ్స్ ద్వారా సెల్ఫీ షాట్‌లను మరింత క్వాలిటీతో క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

అంతేకాకుండా.. 7 రకాల సెలబ్రెటీ మేకప్ ఎఫెక్స్, 10 రకాల కస్టమ్ బ్యూటీ మేకప్ ఎఫెక్స్, 17 రకాల బ్యూటిఫుల్ మేక్‌ఓవర్స్‌ ఈ ఫ్రంట్ కెమెరాలో ఉన్నాయి. మరో ప్రయోగాత్మక ఫీచర్‌లో భాగంగా క్యాప్చుర్ చేసిన ఫోటోలకు పాపులర్ ఫేస్ మాస్క్‌లను యాడ్ చేసుకునే అవకాశాన్ని ఐటెల్ కల్పిస్తోంది.

వేగవంతమన మల్టీ టాస్కింగ్..

itel S41 స్మార్ట్‌ఫోన్‌ స్మూత్ మల్టీ టాస్కింగ్‌తో పాటు అంతరాయంలేని ప్రాసెసింగ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసిన 1.25 GHz మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఖచ్చితమైన పనితీరును కనబరుస్తోంది. ఈ ప్రాసెసర్‌కు జతచేసిన 3జీబి ర్యామ్, ఏక కాలంలో మల్టిపుల్ యాప్స్ రన్ చేస్తూ పని ఒత్తిడిని సునాయశంగా హ్యాండిల్ చేయగలుగుతుంది.

గేమ్స్, ఫోటో ఎడిటింగ్ వంటి రిసోర్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్ లను సైతం ఈ ఫోన్ సునాయాశంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ ఢివైస్ 16 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకనే అవకాశం ఉంటుంది.

ఆండ్రాయడ్ ఆపరేటింగ్ సిస్టం, రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్...

itel S41 స్మార్ట్‌ఫోన్‌‌కు బ్యాటరీ బ్యాకప్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో ఫిట్ చేసిన 2,700mAh లై-పాలిమర్ బ్యాటరీ యూనిట్ సింగిల్ చార్జ్ పై రోజంతా ఫోన్‌కు పపర్ సప్లై చేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై itel S41 బూట్ అవుతుంది.

దాదాపుగా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు. బ్లోట్‌వేర్ సమస్యలు ఉండవు. స్మూత్ ఇంకా సెక్యూర్ ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ డివైస్ ద్వారా పొందవచ్చు. స్లేట్ గ్రే ఇంకా అబ్సీడియన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
There's an immense demand for affordable yet feature loaded smartphones in the Indian market. It is world's fastest growing and biggest mobile phone market
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot