ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

By Gizbot Bureau
|

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను ఫైలింగ్‌కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. రేపటిలోగా మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఆ తర్వాత పైన్‌తో ఉంటుంది. డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యాన్ని బట్టి పెనాల్టీ రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

ITR filing 2019: 5 websites to e-file tax returns before August 31 deadline

గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాయి.

మూడు కేటగిరీలు

మూడు కేటగిరీలు

ఆదాయపన్ను విభాగం ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మూడు కేటగిరీలుగా ఉన్నాయి. ఇండివిడ్యువల్స్ (60 ఏళ్లలోపు వయస్సు) ఇందులో రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్, సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు వారు), సూపర్ సీనియర్ సిటిజన్స్ (80 ఏళ్లకు మించి వయస్సు). రూ.2.5 లక్షలలోపు ఆదాయం కలిగిన వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లతు (60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు) రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు (80 ఏళ్లు పైబడిన వారు) రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉంది.

ఏడు రకాల ఐటీఆర్ పామ్స్

ఏడు రకాల ఐటీఆర్ పామ్స్

ఆన్‌లైన్ ద్వారా సులభ ఈ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇందుకు ఆదాయపన్ను విభాగం సౌకర్యం కల్పించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇండివిడ్యువల్స్ తమ పాన్ కార్డు నెంబర్ ద్వారా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. పాన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మొత్తం ఏడు రకాల ఐటీఆర్ పామ్స్ ఉన్నాయి. ITR-1, ITR-2, ITR-3, ITR-4, ITR-5, ITR-6 and ITR-7.

ఈసారి ఐటీ రిటర్న్స్ ఫామ్స్ ప్రీ-ఫిల్డ్ పార్మాట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీ-ఫిల్డ్ ఫార్మాట్‌లో ఆదాయం, ట్యాక్స్‌లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ వివరాలను బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డు కంపెనీల వంటి థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచి పొందుతాయి. ముందుగా నింపిన డేటాను జాగ్రత్తగా ధృవీకరించుకోవాలి. అలాగే ఇతర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని జోడించాలి.

5 బెస్ట్ వెబ్ సైట్ల లిస్టు

5 బెస్ట్ వెబ్ సైట్ల లిస్టు

ఆన్‌లైన్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి 5 బెస్ట్ వెబ్ సైట్ల లిస్టు ఇస్తున్నాం. ఓ సారి ప్రయత్నించండి.
Income Tax website

ఆదాయపు పన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఆదాయపు పన్ను సంబంధిత సేవలన్నీ ఈ పోర్టల్‌లో పొందొచ్చు. మొదటిసారి ఇ-ఫైలింగ్ చేస్తున్నటైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫామ్ 16 (అందుబాటులో ఉంటే), పెట్టుబడుల వివరాలు ఉండాలి.

2ClearTax:

బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇది. ఈ వెబ్‌సైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సేవల్నీ అందిస్తుంది. ఫామ్ 16 ఉన్నవారు ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే చాలు ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చాలా సులువు అవుతుంది. చివర్లో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్‌కు కేవలం 7 నిమిషాలు పడుతుందని క్లియర్‌ట్యాక్స్ వెబ్‌సైట్ చెబుతోంది.

myITreturn:

ఇది 2006 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టర్ అయింది. ఇది స్కోరీడోవ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇందులో వేతనం, పెట్టుబడులు, లాభాలు, ఆదాయం లాంటి వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఇంగ్లీష్‌తో పాటు 9 భారతీయ భాషల్లో సేవలు లభిస్తాయి.
TaxSpanner:

2007 లో న్యూ ఢిల్లీ, బెంగళూరులోఈ సంస్థ ప్రారంభమైంది. ఇందులో మీరు ఫామ్ 16 అప్‌లోడ్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని స్కాన్ చేస్తుంది. మీరు ఎంచుకునే ప్యాకేజీని బట్టి నిపుణుల సేవలు లభిస్తాయి.

 

Paisabazaar:

పాలసీబజార్ గ్రూప్‌కు చెందిన సంస్థ పైసాబజార్ కూడా ఉచితంగా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ సేవల్ని అందిస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు

ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఆర్ ఫైలింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా ఇ-ఫైలింగ్ చేయొచ్చు.అలాగే ఇ-ఫైల్ ఐటీఆర్, అప్‌లోడ్ రిటర్న్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్, ఇ-పే ట్యాక్స్, ఇ-వెరిఫై రిటర్న్స్ లాంటి సేవలు పొందొచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
ITR filing 2019: 5 websites to e-file tax returns before August 31 deadline

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X