జియో పాత కస్టమర్లకు బంఫరాపర్ !

Written By:

జియో వెలకమ్ ఆఫర్ కింద సిమ్ కార్డులు తీసుకున్న వారికి జియో శుభవార్త అందించనుంది. ఈ ఆపర్ కింద సిమ్ కార్డులు తీసుకున్న వారు జనవరి 1వ తేదీనుంచి కొత్త ఆఫర్ లోకి మారనున్నారు. తద్వారా వారు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ సేవలు పూర్తి స్తాయిలో పొందనున్నారు. అయితే ఈ ఆఫర్ లో 1జిబి మాత్రమే 4జీ వేగంతో లభిస్తుంది.

ప్రధాని ఆవిష్కరించిన భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జనవరి ఒకటో తేదీ నుంచి

జియో 'వెల్కమ్ ఆఫర్' కింద సిమ్ కార్డులు తీసుకున్న కస్టమర్లు జనవరి ఒకటో తేదీ నుంచి అటోమెటిగ్గా కొత్త ఆఫర్లోకి మారిపోనున్నారు. 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' కింద వీరంతా ఉచిత కాల్స్తోపాటు ఉచిత డేటాను కూడా పొందనున్నారు.

రోజుకు 1 జిబి డేటాను మాత్రమే

అయితే డేటాపై మాత్రం పరిమితి అమలుకానుంది. వెల్కమ్ ఆఫర్ కింద రోజుకు 4 జిబిల డేటాను 4 జి వేగంతో అందిస్తే, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద మాత్రం రోజుకు 1 జిబి డేటాను మాత్రమే 4జి వేగంతో అందిస్తారు.

వేగం 128 కెబిపిఎస్ కు

1జిబి వాడిన తరువాత దీని వేగం 128 కెబిపిఎస్ కు తగ్గిపోతుంది. ఒకవేళ ఎక్కువ వేగంతో కూడిన డేటా కావాలనుకుంటే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

4 వ తేదీ తర్వాతి నుంచి

డిసెంబర్ 4వ తేదీ తర్వాతి నుంచి జియో సిమ్ కార్డులు తీసుకున్న కస్టమర్లకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ నే అమలు చేస్తున్నారు. ఈ ప్లాన్ కింద మార్చి 31 వరకు ఉచిత వాయిస్, డేటా సర్వీసులను పొందడానికి అవకాశం ఉంటుంది.

జియో కస్టమర్ల సంఖ్య

ఇప్పటికే జియో కస్టమర్ల సంఖ్య 7 కోట్లకు చేరినట్టు కంపెనీవర్గాలు తెలిపాయి. మార్చిలోపే ఈ సంఖ్య 10 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
It's Official, Reliance Is Keeping Jio Service Free Till 31 March! Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot