డ్యుయల్ కెమెరా సెటప్‌తో iVOOMi i1 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: BOMMU SIVANJANEYULU

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో నిత్యం ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తోన్న యువత లేటెస్ట్ ఫీచర్లతో వస్తోన్న
ఫోన్‌లకు వెంటనే కనెక్ట్ అవుతున్నారు. ఈ ఏడాదికిగాను సంచలనం రేపిన స్మార్ట్‌ఫోన్ ట్రెండ్‌లను పరిశీలించినట్లయితే..

డ్యుయల్ కెమెరా సెటప్‌తో  iVOOMi i1 స్మార్ట్‌ఫోన్‌లు

డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్‌లతో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకుంది. తొలినాళ్లలో ఈ రెండు ఫీచర్లు కేవలం హై-ఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైనప్పటికి, డిమాండ్ దృష్ట్యా వీటిని మిడ్ రేంజ్ ఫోన్‌లలో కూడా అందించటం జరుగుతోంది.

మార్కెట్లో ఈ విధమైన ట్రెండ్ కొనసాగుతోన్న నేపథ్యంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iVOOMi రూ.6000 నుంచి రూ.7000 బడ్జెట్‌లో డ్యుయల్ కెమెరా ఫోన్‌లను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 91మొబైల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం iVOOMi బ్రాండ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోన్నాయి. iVOOMi i1, iVOOMi i1S మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.

2018లో ఐఫోన్ X లాంటి మూడు ఐఫోన్స్ లాంచ్!

18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 5.45 అంగుళాల బీజిల్-లెస్ డిస్‌ప్లే (విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్), 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెెమెరా సపోర్ట్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్ వంటి కీలక ఫీచర్లను ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలు రూ.6,999 నుంచి రూ.9,999 మధ్య ఉండొచ్చని 91 మొబైల్స్ రిపోర్ట్ చెబుతోంది.

English summary
Hong-Based brand has been teasing that they will launch two smartphones dubbed iVOOMi i1 and iVOOMi i1S in January 2018. These smartphones are said to arrive with the full-screen design, 18:9 aspect ratio display and dual cameras and be priced between Rs. 6,999 and Rs. 9,999 in the Indian market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot