Instagram బగ్‌ను క‌నుగొన్నాడు.. రూ.38 ల‌క్ష‌లు గెలిచాడు!

|

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ విద్యార్థి త‌న ప్ర‌తిభ‌తో స‌త్తా చాటాడు. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా మాధ్య‌మం Instagram బ‌గ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో త‌న ప్ర‌తిభ‌ను చాటి రూ.38 ల‌క్ష‌లు గెలుపొందాడు. మీరు విన్న‌ది నిజ‌మే ఆ విద్యార్థి Instagram బ‌గ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో అక్ష‌రాల రూ.38 ల‌క్ష‌లు సాధించాడు. ఆ విద్యార్థి ఎన్నో మిలియ‌న్ల కొద్ది Instagram ఖాతాల‌ను హ్యాక్ కాకుండా కాపాడినందుకు కంపెనీ అత‌డికి ఈ రివార్డు ప్ర‌క‌టించింది. ఇక ఈ విష‌యానికి సంబంధించి పూర్తి వివ‌రాల కోసం వార్త చివ‌రి దాకా చ‌ద‌వండి.

Instagram

జైపూర్‌కు చెందిన విద్యార్థి నీర‌జ్ శ‌ర్మ మిలియ‌న్ల కొద్దీ ఖాతాల‌ను హ్యాక్ చేయ‌గ‌ల ఓ క్లిష్ట‌మైన బ‌గ్‌ను క‌నుగొన్నాడు. ఈ బ‌గ్ యూజ‌ర్ల ఖాతాకు సంబంధించి లాగిన్ ఐడి లేదా పాస్‌వర్డ్ వంటి వివ‌రాలు అవసరం లేకుండానే వినియోగదారు రీల్స్ థంబ్‌నెయిల్స్‌ను మార్చగలదు. అటువంటి క్లిష్ట‌మైన బ‌గ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను నీర‌జ్ క‌నుగొన్నాడు.

ఈ సంద‌ర్భంగా నీర‌జ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బగ్ ఉంది, దాని ద్వారా రీల్ యొక్క థంబ్‌నెయిల్‌ను ఏ ఖాతా నుండి అయినా మార్చవచ్చు. ఖాతాదారుడి పాస్‌వర్డ్ ఎంత సంక్లిష్టంగా ఉన్నా దాన్ని మార్చడానికి ఖాతా యొక్క మీడియా ID మాత్రమే అవసరం." అని శర్మ విలేకరులతో పేర్కొన్నారు.

గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచి శ‌ర్మ త‌న స్వంత Instagram ఖాతాను ఉప‌యోగించి స‌మ‌స్య‌ల‌పై ప‌ని చేయ‌డం ప్రారంభించాడు. అనేక పరిశోధ‌న‌ల అనంత‌రం అత‌డు బ‌గ్‌ను క‌నుగొన‌గ‌లిగాడు. ఆ త‌ర్వాత అదే విష‌యాన్ని అత‌డు ఫేస్‌బుక్ కంపెనీకి తెలియ‌జేశాడు. అత‌డు కంపెనీకి తెలియ‌జేసిన మూడు రోజుల త‌ర్వాత దానిపై డెమోను కోరుతూ కంపెనీ నుంచి రిప్లై వ‌చ్చింది. దీంతో శ‌ర్మ డెమో ఇవ్వ‌డానికి అంగీక‌రించాడు. కేవ‌లం ఐదు నిమిషాల్లో ఇత‌రుల ఐడీలో థంబ్‌నెయిల్స్ మార్చ‌గ‌లిగే విధానాన్ని కంపెనీ స్ప‌ష్టంగా విజ‌య‌వంతంగా చేసి చూపించాడు.

Instagram

దీంతో మెటా యాజ‌మాన్యం అత‌డి ప‌రిశోధ‌న‌ల‌ను అంగీక‌రించింది. త‌న ప‌రిశోధ‌న‌ల‌తో బ‌గ్‌ను క‌నిపెట్టినందుకు అత‌డికి 45వేల యూఎస్ డాల‌ర్లు (రూ.35 ల‌క్ష‌ల‌) రివార్డును అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఫేస్‌బుక్ కూడా బోన‌స్ కింద మ‌రో 4,500 యూఎస్ డాల‌ర్లు(రూ.3 ల‌క్ష‌లు) ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఈ బ‌గ్ క‌నుగొన‌డం ద్వారా అత‌డు బ‌గ్ బౌంటీ ప్రొగ్రామ్ కింద కంపెనీ నుంచి రూ.38 ల‌క్ష‌లు రివార్డును సొంతం చేసుకున్నాడు.

బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లలో భాగం కావడం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లలో భాగమైన అనేక మంది విద్యార్థులు, భద్రతా పరిశోధకులలో శర్మ కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా టీనేజర్లు బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లలో భాగం కావడం మ‌నం చూశాం. ఇటీవ‌ల‌, ఒక యువకుడు Uberని హ్యాక్ చేసి GTA 6 గేమ్‌ప్లే వీడియోలను కూడా లీక్ చేశాడు. మీరు బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లలో భాగం కావాలని చూస్తున్నట్లయితే, మీరు ఆయా కంపెనీల పోర్టల్‌లలో వారి సైన్ అప్ చేసుకోవాలి. త‌ద్వారా మీరు వారి ప్రాజెక్ట్‌లలో భాగం కావచ్చు. ఉదాహరణకు, మీరు Instagram బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ఆన్‌లైన్‌లో చూడ‌వ‌చ్చు. మీరు క్లిష్టమైన బగ్‌లు లేదా స‌మ‌స్య‌ల‌ను కనుగొంటే, మీరు వాటి ద్వారా రివార్డ్ కూడా పొందవచ్చు.

Instagram

అదేవిధంగా, Instagram రీల్‌ను Facebookలో ఎలా క్రాస్-పోస్ట్ ఎలాచేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా మీ మొబైల్ లేదా ట్యాబ్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
* రీల్‌ను రికార్డ్ చేయ‌డం ప్రారంభించాలి.
* రీల్ రికార్డింగ్ పూర్త‌యిన త‌ర్వాత నెక్స్ట్ బ‌ట‌న్ నొక్కాలి.
* ఇప్పుడు మీకు "షేర్ ఆన్ ఫేస్‌బుక్‌" అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీరు ఏదైతే ఫేస్‌బుక్ అకౌంట్‌లో రీల్ ను షేర్ చేయాల‌నుకుంటున్నారో ఆ ఫేస్‌బుక్ ఐడీని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత షేర్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ రీల్ ఫేస్‌బుక్‌లో షేర్ విజ‌య‌వంతం అవుతుంది.

Best Mobiles in India

English summary
Jaipur student rewarded with Rs.38 lacs for finding a critical bug in instagram app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X