ఆన్ లైన్ గేమ్ లపై మోజు ,మోమో గేమ్ కు 12 ఏళ్ళ అమ్మాయి బలి
కొంతకాలం క్రితం ప్రపంచవ్యాప్తంగానే కాదు భారతదేశంలోనూ బ్లూ వేల్ అనే గేమ్ ఎన్ని ప్రాణాలను బలితీసుకున్నదో అందరికి తెలిసిందే.
కొంతకాలం క్రితం ప్రపంచవ్యాప్తంగానే కాదు భారతదేశంలోనూ బ్లూ వేల్ అనే గేమ్ ఎన్ని ప్రాణాలను బలితీసుకున్నదో అందరికి తెలిసిందే. ఆ తర్వాత బ్లూ వేల్ భయాందోళనలు తగ్గాయి. ఇప్పుడు కొత్తగా మోమో పేరుతో మరో డేంజరస్ గేమ్ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎవరు ఎప్పుడు ఈ డేంజరస్ గేమ్ బారిన పడతారో అన్న బయన్దోళనలు వెంటాడుతున్నాయి. చివరకు ఊహించిందే జరిగింది. రాజస్తాన్ కి చెందిన 12 ఏళ్ళ అమ్మాయి మోమో గేమ్‌కు బలైంది.ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.....

12 ఏళ్ళ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది....
అజ్మేర్ జిల్లాలోని బియావర్ కి చెందిన 12 ఏళ్ళ అమ్మాయి మోమో గేమ్‌కు బలైంది. మోమో ఛాలెంజ్‌ను స్వీకరించి తన ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అమ్మాయి కుటుంబ సభ్యుల్ని విచారించారు. మోమో గేమ్ ఆ అమ్మాయిని బలితీసుకున్నట్టు భావిస్తున్నారు.

వాట్సప్ ద్వారా మోమో గేమ్‌కు అలవాటుపడింది....
వాట్సప్ ద్వారా మోమో గేమ్‌కు అలవాటుపడింది. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై సైబర్ సెల్ పోలీసులు విచారణ జరపాలని మృతురాలి కుకుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ అమ్మాయి సెల్‌ఫోన్‌లోని డేటాను విశ్లేషిస్తున్నారు.

MOMO వాట్సాప్ సూసైడ్ గేమ్....
బ్లూవేల్ మాదిరిగానే ఇది కూడా ఒక ప్రాణాలను తీసేలా ఆటగాళ్ళను ప్రేరేపించే గేమ్. ఈ గేమ్ ఆడిన వారు చావుకు ప్రేరేపించబడతారు.ఈ గేమ్ ఆడేటప్పుడు కొన్ని లెవెల్స్ ఉంటాయి.ఆ లెవెల్స్ దాటుకుంటూ వెళ్ళాక ఈ MOMO తమని తాము సూసైడ్ చేసుకోవాలని ఆజ్ఙాపిస్తుంది.ఒక వేళ MOMO ఇచ్చే ఆర్డర్స్ ను తిరస్కరిస్తే తన దగ్గర ఉన్న వీడియోలతో ప్లేయర్ ను బెదిరిస్తుంది.

అమ్మాయి రూపంలో ఉండే అవతార్ .....
జపనీస్ కళాకారుడు Midori హయాషి ఈ MOMO అవతార్ ను తయారు చేసాడు. అయితే ఆయనకు ఈ గేమ్ కు ఎటువంటి సంబంధం లేదు. ఈ గేమ్ లోని ప్రధాన క్యారక్టర్ మోమోని మాత్రమే అతనే సృష్టించాడు. అతను సృష్టించిన MOMO అవతార్ భయంకరమైన శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఓ విచిత్ర ఆకారంతో కనిపిస్తుంది.

ఈ మోమో ను ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు....
ఈ మోమో ను ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు దీని వెనక ఎవరున్నారు అనే వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీని వెనక ఉన్నవారు మాత్రం ఎక్కువగా టీనేజ్ యువతీయువకులనే లక్ష్యంగా చేసుకొని వలలో వేసుకుంటున్నారు.

ఛాలెంజ్ పూర్తిచేయకపోతే....
మోమో సవాల్ అందుకొని ఛాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు మెసేజెస్ వస్తాయి . భయానక చిత్రాలు, హింసాత్మక సందేశాలతో మెసేజ్‌లు పెడతారు . ఇప్పటివరకూ ఇలాంటి మెసేజ్‌లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అవి జపాన్, లాటిన్ అమెరికా దేశాలకు చెందినవని తేలింది.

ఇలాంటి గేమ్స్ కు ఎక్కువ చిన్నారులే....
అయితే ఇలాంటి గేమ్స్ కు చిన్న పిల్లలు త్వరగా అడిక్ట్ అయ్యి వారి ప్రాణాలను బలి చేసుకుంటున్నారు.ఇంతకుముందు వచ్చిన బ్లూ వేల్ గేమ్ వల్ల కూడా ఎక్కువ శాతం మంది చిన్నారులే మరణించారు.


Click it and Unblock the Notifications








