అక్కడ మీ అరచెయ్యే ఏటీఎం కార్డు!!

By Super
|
Japan bank to install palm-reading Biometric ATMs


ఏడాది క్రితం జపాన్‌ను ఓ విధ్వంసకర సునామీ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ భయనాక ఘటనలో వేలాది మంది అసువులుబాయగా, కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం వాటిల్లింది. విలయ తాండవం చేసిన సునామీ ధాటికి అక్కడి వారి ఏటీఎం కార్డులు, పాస్‌బుక్కులు గల్లంతైపోయాయి. ఈ అనుభవంతో ఏటీఎం కార్డులు, పాస్‌బుక్కులు లేకుండా.. కేవలం అరచేతి ముద్రలను గుర్తించి డబ్బులు ఇచ్చే బయోమెట్రిక్ ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేయాలని టోక్యోలోని ఓ ప్రాంతీయ బ్యాంకు ‘ఒగాకీ క్యోరిట్సూ’ నిర్ణయానికొచ్చింది.

 

సెప్టెంబర్‌ నుంచి వీటి వినియోగం అమలులోకి రానుంది. అయితే దీనిలో డబ్బులు తీసుకోవడానికి..అరచేయి ముద్ర మాత్రమే సరిపోదండోయ్!! పిన్ నంబరు, జనన తేదీ కూడా ఇవ్వాల్సిందే. ఈ బయోమెట్రిక్ యంత్రాన్ని ఫుజిట్సు సంస్థ వృద్థి చేసింది. ఈ బయోమెట్రిక్ ఏటీఎంలను ప్రపంచంలో మొదటి సారిగా టర్కీలో ప్రవేశపెట్టారు. ఈ వినూత్న ప్రయోగాన్ని మన దేశంలోనూ అమలు చేస్తే ఏటీఎం దొంగతనాలకు అడ్డుకట్ట పడ్డట్లే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X