జపాన్ టూరిజమ్‌ని ప్రమోట్ చేసేందుకు కొత్త ఐడియా

Posted By: Super

జపాన్ టూరిజమ్‌ని ప్రమోట్ చేసేందుకు కొత్త ఐడియా

జపాన్ టూరిజమ్ ఏజెన్సీ ఆ దేశ టూరిజానికి తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కొత్త మార్గాలను అన్వేషస్తుంది. ఇటీవల కాలంలో జపాన్ దేశానికి సంభవించిన భూకంపం, సునామీ నుండి కొలుకున్న జపాన్ తిరిగి సందర్శకులను ఆకర్శించేందుకు సోషల్ మీడియాపై ఆధాపడుతుంది. ఇందుకు గాను ప్రపంచంలో ఉన్న సోషల్ మీడియా యూజర్స్‌కు వారి టెక్నాలజీ బ్లాగులు ద్వారా జపాన్ దేశం టూరిజమ్ ఇప్పడు అంతా సక్రమంగా ఉందని, హాలీడే స్పాట్ కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ప్రమోట్ చేసేందుకు గాను 10,000 ప్రీ రౌండ్ టిక్కెట్స్‌‍ని అందజేయడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన ట్రావెలర్స్‌కి ఉచితంగా విమాలలో ప్రయాణింపజేయడమే కాకుండా, అక్కడుండానికి అయ్యేటటువంటి ఖర్చు, భోజన సదుపాయలకు జపాన్ టూరిజమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఆ ఎంపిక చేసిన ట్రావెలర్స్ చేయాల్సిందల్లా ఏమిటంటే సునామీ తర్వాత జపాన్ దేశం టూరిజమ్‌కు అనుకూలంగా ఉందని, ఎటువంటి ఇబ్బందులను మేము ఎదుర్కోనలేదని తమయొక్క సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్స్ ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ విషయాలన్నింటిని జపాన్ టూరిజమ్ ప్రతినిధి ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా మేము జనాభాని ఎవరైతే బాగా ప్రభావితం చేస్తారో అటువంటి బ్లాగులు రాసే వారిని, సునామీ తర్వాత జపాన్ దర్శించడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలియజేసేందుకు ఈ ఆఫర్‌ని ప్రకటించడం జరిగిందని అన్నారు. ఇటీవల కాలంలో జపాన్‌లో సంభవించిన సునామీ, భూకంపానికి సుమారు 20,000 మంది జనాభా చనిపోవడమే కాకుండా, న్యూక్లియర్ ప్లాంట్‌లో ఉత్పన్నమైన రేడియన్ ప్రభావానికి గాను 80,000 మంది జనాభా అంగవికలాంగులుగా అవడం జరిగింది. ఈ సునామీ సంభవించిన తర్వాత జపాన్ దేశాన్ని సందర్శిండానికి మొదటి మూడు నెలలో 50శాతం మంది విముఖత చూపించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot