ఆసియాలో ఐఫోన్ 5 అమ్మే అవకాశం మాకు ఇవ్వండి..

Posted By: Super

ఆసియాలో ఐఫోన్ 5 అమ్మే అవకాశం మాకు ఇవ్వండి..

టోక్యో: రాబోయే కాలంలో యాపిల్‌ కంపెనీ విడుదల చేయనున్న ఐఫోన్ 5 సమాచారాన్ని మార్కెట్లో విడుదల చేయనప్పటికీ మార్కెట్లో ఉన్న రూమర్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అక్టోబర్‌లో ఐఫోన్ 5 విడుదలవుతుందని అంటున్నారు మొబైల్ నిపుణులు. త్వరలో మొబైల్ మార్కెట్లోకి రానున్న యాపిల్‌ కంపెనీ కొత్త ఐఫోన్ 5 ఈసారి గట్టి పోటీని ఎదుర్కోవడం తధ్యం అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో యాపిల్‌ ఐఫోన్ 5కి ఉన్న డిమాండ్‌ని బట్టి దాని మార్కెటింగ్ చేజిక్కించుకొవడం కూడా చాలా కష్టమైపోతుంది.

ఆసియా దేశాల్లో యాపిల్‌ ఐఫోన్‌-5ను మార్కెటింగ్‌ చేసే అవకాశాన్ని దక్కించుకునేందుకు జపాన్‌కు చెందిన మొబైల్‌ సంస్థ కెడిడిఐ దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోంది. నవంబర్‌ నుంచి ఐ ఫోన్‌-5 ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో పాటు పలు ఆసియా దేశాల్లో ఈ ఫోన్‌ను విక్రయించాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేసినట్టు నిక్కీ బిజినెస్‌ మేగజైన్‌ ప్రత్యేక కధనాన్ని ప్రచురించింది. ఈ వార్త వెలువడిన తరువాత జపాన్‌లో యాపిల్‌ ప్రొడక్టులను మార్కెటింగ్‌ చేస్తున్న సాఫ్ట్‌బ్యాంక్‌ కార్పొరేషన్‌ ఈక్విటీ వాటాల విలువ 12 శాతం పతనమైంది.

ఇక ఐఫోన్ 5 ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే iOS 5 అపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ 5 స్మార్ట్ ఫోన్ మొబైల్ వెనుక భాగాన 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. గతంలో విడుదల చేసిన ఐఫోన్స్‌తో పోల్చితే ఐఫోన్ 5 చాలా తక్కువ మందం కలిగి ఉంటుందని వెల్లడించారు. ఐఫోన్ 5 మొబైల్‌తో 1080p వీడియో రికార్డింగ్‌ని నమోదు చేయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్, డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకతలు. మార్కెట్లో ఉన్ రూమర్ ప్రకారం ఐఫోన్ 5ని మోటరోలా డ్రాయిడ్ బయోనిక్ అన్నింటిలోను అధిగమిస్తుందని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot