ప్రపంచంలో బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఇదే! ఎంతో తెలుసా ...? మీరు అసలు ఊహించలేరు.  

By Maheswara
|

ఇంటర్నెట్ టెక్నాలజీ లో జపాన్ యొక్క కొత్త దూకుడు మనల్ని చాలా వేగవంతమైన ఇంటర్నెట్‌కు చేరువ చేస్తోంది. ఈ కొత్త విజయంతో, జపనీస్ పరిశోధకులు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ప్రస్తుత వేగం కంటే 100,000 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ గా అభివృద్ధి చేయడానికి దగ్గర్లో ఉన్నారు.

Japans Researchers Achieved 100000 Times Faster Internet Speed Than Current Speed. Full Details Here.

ప్రస్తుతం, కొత్త రిపోర్ట్ ప్రకారం డేటా ట్రాన్స్‌మిషన్ వేగం లో జపనీస్ పరిశోధకులు కొత్త రికార్డు ను సృష్టించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగం కంటే 100,000 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మరొక అడుగు ముందుకు వేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (NICT)లోని నెట్‌వర్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మల్టీ-కోర్ ఫైబర్ (MCF)లో సెకనుకు 1.02 పెటాబిట్ వేగాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

Japans Researchers Achieved 100000 Times Faster Internet Speed Than Current Speed. Full Details Here.

పెటాబిట్ వేగం మన ఇంటి రూటర్‌లకు ఎప్పుడు వస్తుంది.

పెటాబిట్ (PB), డేటా యూనిట్, 1,000,000 గిగాబైట్‌లకు (GB) సమానం. సెకనుకు 1 పెటాబిట్ ఇంటర్నెట్ వేగంతో ప్రపంచం ఏమి చేయగలదు? అని పరిశీలిస్తే , 8K ప్రసారానికి సంబంధించిన 10 మిలియన్ ఛానెల్‌లు ఒక సెకనుకు రన్ చేయగలవు, ప్రస్తుతం లైవ్ వీడియో ప్రసారాలను ఇబ్బందికరంగా మార్చే అన్ని లాగ్‌లు మరియు స్నాగ్‌లను తొలగించవచ్చు.

Japans Researchers Achieved 100000 Times Faster Internet Speed Than Current Speed. Full Details Here.

1.02 PB ప్రతి సెకనుకు 51.499 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. త్వరలో, ప్రతి సెకనుకు 127,500 GB డేటాను పంపవచ్చు. ఈ సాధనలో అత్యుత్తమ విషయం ఏమిటంటే ఈ సాంకేతికతను వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ టెక్నాలజీ లో PB వేగంతో డేటాను ప్రసారం చేయడానికి, మనకు ప్రామాణిక ఆప్టిక్ ఫైబర్ కేబుల్ మాత్రమే అవసరం. మనము సాధారణంగా ఉపయోగించే మరియు అందుబాటులో ఉండే కేబుల్స్ మాత్రమే సరిపోతాయి. కానీ, పెటాబిట్ ఇంటర్నెట్ సామర్ధ్యం ఇప్పటికిప్పుడే మన హోమ్ రూటర్‌లకు వచ్చే అవకాశం లేదు. సమీప భవిష్యత్తులో 10 Gbps వేగం వరకు మనకు అందుబాటులోకి రావొచ్చు. ఫిబ్రవరి, 2022లో, ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ఈ దశాబ్దం ముగిసేలోపు 10 Gbps ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇంటర్నెట్ స్పీడ్ పరీక్ష సమయంలో Comcast గరిష్టంగా 10 Gbps వేగాన్ని సాధించినట్లు పేర్కొంది.ఇది కేబుల్‌ల్యాబ్స్ ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పరిశోధకులు తప్పనిసరిగా ఇప్పటికే ఉన్న ఫైబర్ కనెక్షన్ లకు సెకనుకు అధిక సంఖ్యలో బిట్‌లను రవాణా చేయడానికి వీలు కల్పిస్తారని అంచనాలున్నాయి.ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో గమనించాలి.

Best Mobiles in India

English summary
Japan's Researchers Achieved 100000 Times Faster Internet Speed Than Current Speed. Full Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X