మీకోసం జపాన్‌లో 2 లక్షల IT ఉద్యోగాలు,శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డులు కూడా..

Written By:

ఇండియాలోని టెకీలకు జపాన్ శుభవార్త అందించబోతోంది. సాప్ట్‌వేర్లకు మంచి అవకాశాలు కల్పించేందుకు జపాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. భారత ఐటీ నిపుణులకు టాప్‌ ఫేవరెట్‌ దేశంగా ఇక నుంచి జపాన్‌ కూడా చరిత్రలో చోటు దక్కించుకునేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి రెండు లక్షల మంది టెకీలను నియమించుకోవాలని జపాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్‌న్యూస్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రాకతో, అటు అమెరికాలోనే కాక, ఇటు భారత్‌లోనూ ఐటీ నిపుణుల నియమాకాలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే.

అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లైఫ్‌ సైన్సెస్‌, ఫైనాన్స్‌, సర్వీసెస్‌, అ‍గ్రికల్చర్‌..

కాగా అంతకముందు అంచనా వేసిన దానికంటే తక్కువగా నికర ఎంప్లాయీ అడిక్షన్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిభావంతులైన భారత ఐటీ నిపుణులను జపాన్‌ నియమించుకోవాలని చూస్తుందని, ముఖ్యంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫైనాన్స్‌, సర్వీసెస్‌, అ‍గ్రికల్చర్‌ వంటి వాటిల్లో ఈ నియామకాలు చేపట్టాలని భావిస్తుందని తెలిసింది.

గ్రీన్‌ కార్డులను కూడా ..

నియమించుకున్న నిపుణులకు గ్రీన్‌ కార్డులను కూడా జారీచేయనున్నామని, దీంతో ఏడాది లోపల శాశ్వత నివాస హోదా అందిస్తామని జపాన్‌ చెప్పింది. భారత్‌-జపాన్‌ బిజినెస్‌ పార్టనర్‌షిప్‌ సెమినార్‌ సందర్భంగా ఈ విషయాలను ఆయన షిగికి వెల్లడించారు. కాగా బెంగళూరు ఛాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌, జేఈటీఆర్‌ఓ సంయుక్తంగా ఈ సెమినార్‌ను నిర్వహించాయి.

జపాన్‌లో సెటిల్‌ అవడానికి..

భారత్‌ నుంచి వచ్చే రెండు లక్షల ఐటీ నిపుణులు జపాన్‌లో సెటిల్‌ అవడానికి గ్రీన్‌ కార్డులను కూడా జారీచేస్తోంది. దేశంలో ఐటీ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి మా దేశం సహకరించనుందని జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(జేఈటీఆర్‌ఓ) ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ షిగికి మైదా తెలిపారు.

దేశంలో 9,20,000 మంది ఐటీ నిపుణులు..

ప్రస్తుతం తమ దేశంలో 9,20,000 మంది ఐటీ నిపుణులున్నారని, భారత్‌ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులకు వెంటనే డిమాండ్‌ ఉందని చెప్పారు. ఎనిమిది లక్షలకు పైగా ప్రొఫిషనల్స్‌ను 2030 వరకు నియమించుకోనున్నామని పేర్కొన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం

కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ ఉద్యోగ సర్టిఫికేట్‌ను, మల్టిపుల్‌-ఎంట్రీ వీసా వివరణ లేఖలను సమర్పించాల్సినవసరం లేదు. వీసా ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా తగ్గించి, కేవలం మూడు డాక్యుమెంట్లకే పరిమితం చేశారు.

జపాన్‌కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉంటే..

ఒకవేళ జపాన్‌కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉంటే, వారు పాస్‌పోర్టు, వీసా అప్లికేషన్‌ ఫామ్‌ను సమర్పిస్తే చాలు. సరళతరం చేసిన ఈ నిబంధనలు 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Japan To Hire 2 Lakh Indian IT Staffers, Offers A Unique Green Card More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot