సాప్ట్‌వేర్ ఉద్యోగుల భద్రతకు భారత ఐటి కంపెనీల చర్యలు

Posted By: Super

సాప్ట్‌వేర్ ఉద్యోగుల భద్రతకు భారత ఐటి కంపెనీల చర్యలు

న్యూఢిల్లీ: జపాన్‌కు అణు రేడియేషన్ ముప్పు పొంచివున్న నేపధ్యంలో అక్కడ పనిచేస్తున్న తమ ఉద్యోగుల భ ద్రత కోసం భారత ఐటి దిగ్గజాలైన టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ చర్యలు చేపట్టాయ. జపాన్‌లోని తమ సిబ్బంది స్వదేశానికి రప్పించేందుకు, అలాగే తమ జపాన్ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ఈ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయ.

మా ఉద్యోగుల భ ద్రత మాకు ముఖ్యం. జపాన్‌లో పనిచేసే భారత సిబ్బంది.. వారి కుటుంబాలు స్వదేశానికి రావాలనుకుంటే వారికి ఏర్పాట్లు చేస్తాం, అలాగే స్థానిక జపనీస్ ఉద్యోగులు, వారి కుటుంబాలను వేరే సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని టిసిఎస్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. జపాన్‌లో మా సిబ్బంది క్షేమంగా ఉన్నారు. అయనప్పటికీ వారు కోరితే స్వదేశానికి రప్పించి ఇక్కడ అదే స్థాయలో ఉద్యోగాలు కల్పిస్తామని విప్రో సీనియర్ ఉపాధ్యక్షుడు (హెచ్‌ఆర్) సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.

జపాన్‌లో ప్రస్తుత విపత్తు నేపధ్యంలో అక్కడ పనిచేసే మా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎవరైనా తాత్కాలికంగా భారత్ రావాలని కోరితే అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot