ఎగిరే విమానకారులు వచ్చేస్తున్నాయ్, ఎలా ఉన్నాయో చూడండి

By Gizbot Bureau
|

టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఎగిరే కార్లు వస్తున్నాయి. టెక్నాలజీకి కేరాఫ్ అయిన జపాన్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా ఈ ఫ్లయింగ్ కారులో హాయిగా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఎగిరే విమానకారును 2030 సంవత్సరం నాటిని తీసుకొస్తామని జపాన్‌ దిగ్గజ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎన్‌ఈసీ ప్రకటించింది.

New Japanese Flying Car Gets Off the Ground, for About a Minute

తాజాగా డ్రోన్‌ ఆకారంలో ఉన్న విమానాన్ని టోక్యోలో పరీక్షించింది. నాలుగు ప్రొపెల్లర్లు, మూడు చక్రాలు గల ఈ విమానకారును రిమోట్‌ సహాయంతో భూమి నుంచి పది అడుగుల ఎత్తు వరకు ఎగిరించి గాలిలో నిమిషం పాటు నిలిపి కిందికి దించారు. ఈ ప్రయోగాన్ని అత్యంత పకడ్బందీగా పెద్ద లోహపు పంజరంలో నిర్వహించారు.

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి

దేశంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఫ్లయింగ్ కార్లను అభివృద్ధి చేయాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఎన్‌ఈసీ కంపెనీ విమానకారు తయారీలో నిమగ్నమైంది. తాజాగా చేపట్టిన ట్రయల్‌రన్‌ విజయవంతమైందని కంపెనీ ప్రకటించింది.

ఎగిరే కార్లపై దృష్టి

ఎగిరే కార్లపై దృష్టి

జపాన్‌ ఈశాన్య ప్రాంతమైన ఫుకుషిమాలో 2011లో వచ్చిన సునామీ, అణు విపత్తుల నుంచి ఇంకా తేరుకోని జపాన్‌ త్వరితగతిన ప్రజలను సురక్షిత స్థావరాలకు చేర్చడానికి ఎగిరే కార్లపై దృష్టి సారించిందని అనాడే వార్తలు వెలువడ్డాయి. అలాగే జపాన్‌లోని అనేక చిన్న ద్వీపాలను అనుసంధానించడానికి వీటిని ఉపయోగించాలని భావిస్తోంది.

 2017లోనే పరీక్షలు
 

2017లోనే పరీక్షలు

కాగా ఎన్‌ఈసీ కంపెనీ ఎగురుతున్న కారును 2017లోనే పరీక్షించగా నేలపై కూలిపోయి విఫలమైంది. ఇప్పుడు విజయవంతం అవడంతో త్వరగా వీటిని తయారుచేయాలని నిశ్చయించుకుంది. అమెరికాలో సైతం ఉబెర్‌ కంపెనీ ఎగిరేకార్ల తయారీలో బిజీగా ఉంది. విమానకార్లకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండటంతో ఎలాగైనా ఈ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని రెండు కంపెనీలు ఇప్పటినుంచే పోటీపడుతున్నాయి.

ట్రాఫిక్ నరకం

ట్రాఫిక్ నరకం

ఈ ఎగిరే కార్లు ఇప్పుడు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.త్వరగా ఇవి అందుబాటులోకి రావాలని, వాటిలో ఎక్కి గాల్లో షికారు చేయాలని ఆశిస్తున్నారు. కాగా రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఎగిరే కార్లు వస్తే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎంచక్కా నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చెబుతున్నారు. ఎగిరే కార్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

Best Mobiles in India

English summary
New Japanese Flying Car Gets Off the Ground, for About a Minute

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X