ఈత కొట్టే రోబోట్!

Posted By: Staff

ఈత కొట్టే రోబోట్!

మానవుడు రూపొందించిన ఆ మరమనిషి సెకను కాలంలో ఆరు మీటర్ల దూరాన్ని ఈదగలదు. వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ?, టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధక బృందం ఈ ఈతకొట్టే రోబోను డిజైన్ చేసింది. 3డీ స్కానర్ ఆధారితంగా స్పందించే ఈ రోబోట్ అచ్చం మనిషిలాగానే స్విమ్ చేస్తుంది. స్వూమనాయిడ్‌గా పిలుచుకునే ఈ రోబో పనితీరు పట్ల జపాన్ పరిశోధకలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోబోలను ఒలంపిక్స్ కు ఎంపిక చేస్తే బంగారు పతకాలు సాధించటం ఖాయం!.

రోబో భామ!

సాంకేతికత సాయంతో రూపుదిద్దుకుంటున్న రోబోట్‌లు, మనుషుల్లా భావోద్వేగాలను పలికించలేవన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు మానవుల్లాగా సహజమైన రీతిలో భావోద్వేగాలను పలికించే ‘ఫేస్’రోబోను రూపొందించారు. పై చిత్రంలో భామను పోలి ఉన్న ఆ రోబో సహజసిద్ధమైన రీతిలో ముఖ కవళికలను కలిగి వ్యక్తీకరణలను పలికించిన వైనాన్ని వేరువేరు చిత్రాత ద్వారా గమనించవచ్చు. ఆ రోబోను ఇలా తీర్చిదిద్దటానికి పరిశోధకులకు 30 సంవత్సరాల సమయం పట్టిందట. ఈ రోబో భామ ముఖంలో ఉండే 32 మోటార్లు వివిధ భావోద్వేగాలను పలికించడంలో సాయపడతాయి. హెఫెస్(హైబ్రీడ్ ఇంజిన్ ఫర్ ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్ సింథసిస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ మొత్తం రోబో పనిచేస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting