జీన్స్‌లో అంతర్నిర్మిత 'ల్యా‌ప్‌టాప్' కంప్యూటర్

Posted By:

జీన్స్‌లో అంతర్నిర్మిత 'ల్యా‌ప్‌టాప్' కంప్యూటర్

 

లండన్: కంప్యూటర్‌ని వదిలి పెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేనంత అలవాటు పడిపోయారా? అలాంటి వారి కోసం ఎల్లప్పుడూ మీతోనే ఉండే ఓ సరిక్రొత్త కంప్యూటర్‌ని తయారు చేశారు నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు. ఇది నిజంగానే ఒడిలోనే ఉండిపోయే ల్యాప్‌టాప్. రోజూ మీరు తొడుక్కునే జీన్స్‌ప్యాంట్‌లోనే ల్యాప్ టాప్‌ను వాడుకోవచ్చు. ఎరిక్ డే నిజిస్, టిమ్ స్మిట్ అనే ఇద్దరు పరిశోధకులు బ్యూటీ, గీక్‌ల పేరిట రెండు జతల ల్యాప్‌టాప్ జీన్స్ ప్యాంట్లను తయారు చేశారు.

వీటి ప్రత్యేకతలు ఏంటంటే.. ప్యాంటులోనే పూర్తిస్దాయిలో పనిచేసే కీబోర్డు, మౌస్, స్పీకర్లు తొడల ప్రాంతంలో అమర్చి ఉంటాయి. నిజంగానే ఒళ్లో ఉంటే కీబోర్డు, మన వద్దనే ఉండే మౌస్‌తో ఎంచక్కా కంప్యూటర్‌పై పని చేసుకోవచ్చు. త్వరలో మార్కెట్లోకి రానున్న  ఈ జీన్స్ ఖరీదు సుమారుగా £250 ఉంటుందని వీటిని రూపొందించిన వారు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot