Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...

|

రిలయన్స్ జియో గత మూడు సంవత్సరాలుగా భారతీయ టెలికాం మార్కెట్లో తన సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2019 డిసెంబర్‌లో జరిగిన తాజా టారిఫ్ రివిజన్ తర్వాత కూడా ప్రీపెయిడ్ విభాగంలో రిలయన్స్ జియో పైచేయి సాధించింది.

 ప్రీపెయిడ్ ప్లాన్‌

ఉదాహరణకు జియో తన 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ తో 1.5 జిబి రోజువారీ డేటాను అందిస్తుండగా భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటివి రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జితో ఈ రకం డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నారు.

 

 

OnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీOnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీ

 

 

ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియో
 

ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియో

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన వాటిలో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు టారిఫ్ రివిజన్ తర్వాత ఇప్పుడు ఇతర రెండు టెల్కోలతో సమానంగా ఉన్నాయి. రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే రిలయన్స్ జియో యొక్క రూ.399 ప్లాన్ కూడా 1.5 జీబీ డైలీ డేటా బెనిఫిట్‌తో వస్తుంది. రిలయన్స్ జియో నుండి మరొక నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు రోజువారీ 1.5GB 4G డేటాను అందిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

BSNL 4G: 4G స్పెక్ట్రంను అందుకున్న BSNL... త్వరలోనే ప్రారంభం...BSNL 4G: 4G స్పెక్ట్రంను అందుకున్న BSNL... త్వరలోనే ప్రారంభం...

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ తన 28 రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 42GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా జియో - టు -జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు నాన్-జియోలకు 1,000నిమిషాల FUP వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

 

Realme vs Samsung vs Nokia : తక్కువ ధరలో రియల్‌మికి పోటీ ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో ఇవే...Realme vs Samsung vs Nokia : తక్కువ ధరలో రియల్‌మికి పోటీ ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో ఇవే...

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తున్న ప్లాన్‌లలో ఎక్కువగా జనాదరణ పొందిన వాటిలో రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ముందు వరుసలో ఉంది. ఈ ప్లాన్ అందిస్తూన్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మొత్తంగా 56 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటా, అపరిమిత జియో-టు- జియో వాయిస్ కాలింగ్, నాన్-జియోలకు 2,000నిమిషాలతో పాటుగా రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్ యొక్క మొత్తం 56 రోజుల చెల్లుబాటు కాలంలో 84GB డేటాను వినియోగదారులకు అందించబడుతుంది. ఇంతకుముందు ఇదే ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందించడానికి ఉపయోగించబడింది. కాని ఇప్పుడు దీని యొక్క చెల్లుబాటు కాలం 56 రోజులకు తగ్గించబడింది.

 

 

క్షణాలలో పాన్ కార్డు పొందే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వంక్షణాలలో పాన్ కార్డు పొందే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం

జియో రూ.555 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.555 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో కొన్ని నెలల క్రితం ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ రీఛార్జిని 555 రూపాయల ధర వద్ద ప్రవేశపెట్టింది. అదే రూ.555ల ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100SMSలు, జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 3,000నిమిషాల నాన్-జియో కాలింగ్ ప్రయోజనాలను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

జియో రూ.2299 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.2299 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క పోర్ట్‌ఫోలియోలో చివరి 1.5GB రోజువారీ డేటా ప్లాన్ 2,299 రూపాయల వార్షిక రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS లు, జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 12,000 నాన్-జియో నిమిషాల ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. గత నెలలో ప్రవేశపెట్టిన న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో రూ.2,299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కేవలం రూ.2,020 లక్ అందించింది.

పైన తెలిపిన అన్ని ప్లాన్‌లు జియో యొక్క OTT యాప్ లు అయిన JioTV, JioCinema లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.

 

Best Mobiles in India

English summary
Jio 1.5GB Plans Starts at Rs 199 and 365 Days Validity: Benefits and Other Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X