జియో "హ్యాపీ న్యూ ఇయర్" ఆఫర్ : 100% క్యాష్ బ్యాక్

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్బంగా సరి కొత్త "హ్యాపీ న్యూ ఇయర్" క్యాష్ బ్యాక్ ఆఫరు ను యూజర్లకు తీసుకొచ్చింది.ఈ ఆఫర్ లో భాగంగా రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు 100% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అయితే ఈ ఆఫర్ జనవరి 31 2019 రోజుతో ముగుస్తుంది.

Google Routine వచ్చేసింది, అప్‌డేట్, పనితీరుపై ఓ లుక్కేయండిGoogle Routine వచ్చేసింది, అప్‌డేట్, పనితీరుపై ఓ లుక్కేయండి

రూ. 399 ప్లాన్...

రూ. 399 ప్లాన్...

రీఛార్జ్ MyJio యాప్ నుండి రూ. 399 ప్లాన్ ఎన్నుకొని రీఛార్జ్ చేయవలసి ఉంటుంది రీఛార్జ్ విజయవంతంగా అయిన తర్వాత మీకు MyJio యాప్ లోకి రూ. 399 విలువగల కూపన్ వస్తుంది.

ఈ-కామర్స్ పోర్టల్  AJIO లో...

ఈ-కామర్స్ పోర్టల్ AJIO లో...

ఈ రూ.399 కూపన్లను కంపెనీకి చెందిన ఈ-కామర్స్ పోర్టల్ AJIO లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. AJIO కలిసి ప్రకటించిన ఈ నూతన సంవత్సర ఆఫర్ MyJio యాప్‌లో మై కూపన్స్ క్రెడిట్ కానున్నది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందాలంటే కనీసంగా రూ.1,000 వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది

పూర్తి క్యాష్ బ్యాక్....

పూర్తి క్యాష్ బ్యాక్....

ఈ పూర్తి క్యాష్ బ్యాక్ కొత్త మరియు పాత వినియోగదారులకు వర్తిస్తుంది.ఈ పూర్తి క్యాష్ బ్యాక్ కోసం AJIO యాప్ లో లేదా వెబ్సైటు లో మార్చ్ 15 2019 వరకు మాత్రమే ఓచర్ వినియోగించుకోవాలి.

రిలయన్స్ జియో సంస్థకు...

రిలయన్స్ జియో సంస్థకు...

వచ్చే కొత్త సంవత్సరం రిలయన్స్ జియో సంస్థకు ముఖ్యమైన సంవత్సరం కాబోతుంది. రిలయన్స్ జియో, తన భవిష్యత్ ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది.ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెను సంచలనాలకు తెరతీస్తూ రిలయన్స్ అభివృద్థి చేసిన జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మార్చ్ 2019 నుంచి అందిరికి అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం, సంస్థ ప్రివ్యూ ఆఫర్లో భాగంగా 3 నెలలు 100Mbps వేగంతో నెలకు 1100GB కు ఇవ్వడం జరుగుతుంది.

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా హై-స్పీడ్ వై-ఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగాటీవీ అలానే స్మార్ట్‌హోమ్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌ను మీ ఇంట్లో సెటప్ చేసే క్రమంలో కంపెనీ ప్రతినిధులు మీ హోమ్ లేదా ఆఫీసులో ప్రత్యేకమైన జియో గిగా‌రౌటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్‌లను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

పెద్ద స్ర్కీన్ టీవీలను ఉపయోగించుకునే వారు గిగాటీవీ సెట్‌-టాప్ బాక్సులను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వారికి వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీంతో వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఈ సెట్-టాప్ బాక్సు ద్వారా 600లకు పైగా టీవీ చానల్స్‌తో పాటు వేలాది సినిమాలు, లక్షలాది పాటలను యూజర్ ఆస్వాదించే వీలుంటుంది. టీవీ స్ర్కీన్ పై జియో టీవీ, జియో సినిమా, జియోటీవీ కాల్, జియో స్మార్ట్ లివ్వింగ్, జియో నెట్ వెలాసిటీ, జియో క్లౌడ్, మీడియాషేర్ ఇంకా జియో స్టోర్ వంటి యాప్స్ అందుబాటులో ఉంటాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్‌ను టీవీకి అనుసంధానించుకుని వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్ హోమ్ సూట్ గుండెకాయిలా నిలుస్తుంది. ఆడియో డాంగిల్, వీడియో డాంగిల్, స్మార్ట్ స్పీకర్, వై-ఫై ఎక్స్‌టెండర్, స్మార్ట్ ప్లగ్, అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా, టీవీ కెమెరా వంటి యాక్సెసరీస్ ఈ సూట్‌లో భాగంగా లభిస్తాయి. గిగాఫైబర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన ఇళ్లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఒక ఇంటిలో సెటప్ చేయటానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Jio 2019 Happy new year offer launched with 100 per cent cashback, discounts and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X