Home
News

జియో మళ్లీ సంచలనం, సరికొత్తగా రోజుకు 2జిబి డేటా ప్యాక్

దేశీయ టెలికాం రంగంలో జియో ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతూనే ఉంది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో జియో ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతూనే ఉంది. కంపెనీ ఇతర టెలికాం దిగ్గజాలను సవాల్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంది. ఐపీఎల్ సంధర్భంగా కంపెనీ అదిరిపోయే ప్లాన్లను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ ధరతో ఎక్కువ డేటాను పొంది ఐపీఎల్ మ్యాచ్ లను ఆస్వాదించమంటూ సమ్మర్ లో యూజర్లను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడ అదే ఊపులో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు రూ.101తో సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.

4 రోజుల వ్యాలిడిటీతో..

4 రోజుల వ్యాలిడిటీతో..

రోజుకో 2జిబి డేటా చొప్పున 4 రోజుల వ్యాలిడిటీతో ఈ జియో ఈ ప్లాన్ అందిస్తోంది. మొత్తం 8జిబి డేటాను 4 రోజుల పాటు యూజర్లు అందుకుంటారు. దీని ధర రూ. 101. ఈ డేటా అయిపోయిన తరువాత యూజర్లు 4 రోజుల పాటు 64Kbpsతో అన్ లిమిటెడ్ డేటాను అందుకోవచ్చు. అయితే ఇది ఖచ్చింతగా ఉందా లేదా అనేది ప్లాన్ లో చెప్పలేదు.

మై జియో యాప్

మై జియో యాప్

ఈ ప్లాన్ పొందాలనుకునే యూజర్లు మై జియో యాప్ లో కెళ్లి మై ప్లాన్స్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ ప్లాన్ లో కంపెనీ ఎటువంటి కాల్స్ కాని ఎసెమ్మెస్ లు కాని ఆఫర్ చేయడం లేదు. కేవలం డేటాను మాత్రమే అందిస్తోంది.

రూ.251 ప్యాక్

రూ.251 ప్యాక్

కాగా జియో కంపెనీ ఐపీఎల్ అభిమానుల కోసం రూ.251 ప్యాక్ ప్రవేశపెట్టిన సంగతి విదితమే.దీని ద్వారా యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున 51 రోజులు పాటు పొందుతారు. క్రికెట్ ప్యాక్ కింద దీన్ని యూజర్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో..

ఐపీఎల్ దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో..

ఈ డేటా ద్వారా యూజర్లు క్రికెట్ మ్యాచ్ లైవ్ వీడియోని ఆస్వాదించవచ్చు. ఐపీఎల్ దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ ప్లాన్ కంపెనీ తీసివేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్ లో భాగంగానే రూ.101తో మరో 8జిబి అదనపు డేటాను కంపెనీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

డేటా మాత్రమే ఆఫర్

డేటా మాత్రమే ఆఫర్

ఈ రెండు ప్లాన్లలో రిలయన్స్ జియో డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. కాల్స్ కాని ఎసెమ్మస్ లు కాని ఆఫర్ చేయడం లేదు. దీనికి పోటీగా ఇతర టెలికాం దిగ్గజాలు కూడా కొత్త ప్లాన్లను లాంచ్ చేశాయి. ఎయిర్ టెల్ ఈ ప్లాన్లలో జియోకి పోటీగా నిలుస్తోంది.

Best Mobiles in India

English summary
Jio Cricket Pack Offers Complimentary 2GB Data Per Day Worth Rs. 101 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X