ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా Jio యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లు!

|

భార‌త ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా Reliance Jio ఇప్ప‌టికే యూజ‌ర్ల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్‌తో కూడిన ఓ ప్లాన్‌ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా, దానికి తోడు మ‌రో రెండు ఆఫ‌ర్ల‌ను వినియోగ‌దారుల ముందుకు తీసుకు వ‌చ్చింది. దీంతో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా జియో కంపెనీ త‌మ యూజ‌ర్ల‌కు మూడు ఆఫ‌ర్లు ప‌రిచ‌యం చేసిన‌ట్ల‌యింది.

 
ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా Jio యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లు!

ఈ మూడు కొత్త ఆఫ‌ర్లు కూడా ప‌రిమిత స‌మ‌యం వ‌ర‌కే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫ‌ర్లు మీకు వెబ్‌సైట్‌లో క‌న‌ప‌డ‌క‌పోతే.. మీరు వాటిని ఖచ్చితంగా MyJio యాప్‌లో పొందవచ్చు. ఇప్పుడు ఆ ఆఫ‌ర్లేమిటో వివ‌రంగా తెలుసుకుందాం.

మొద‌టగా జియో రూ.750 ప్లాన్ ఆఫ‌ర్‌ :

మొద‌టగా జియో రూ.750 ప్లాన్ ఆఫ‌ర్‌ :

జియో అందిస్తున్న రూ.750 ప్లాన్ అనేది రెండు వేర్వేరు ప్లాన్‌ల క‌ల‌యిక‌. ఈ కాంబినేషన్‌లో మొదటిది రూ.749 ప్లాన్ కాగా, మరొకటి రూ.1 ప్లాన్ గా ఉంది.
* రూ.749 ప్లాన్‌తో, Jio వినియోగదారులు 2GB రోజువారీ డేటా (64 Kbps పోస్ట్), అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు పొందుతారు. అంతేకాకుండా, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

* ఈ కాంబినేషన్‌లో రెండో ప్లాన్ రూ.1 ప్లాన్ గా ఉంది. రూ.1 ప్లాన్‌తో, జియో వినియోగదారులకు 100MB డేటాను (నిర్ణీత డేటా పూర్త‌య్యాక 90 Kbps స్పీడ్‌) ఇస్తుంది మరియు దాని వాలిడిటీ 90 రోజులు ఉంటుంది.

జియో ఫైబ‌ర్ యూజ‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేలా మ‌రో ఆఫ‌ర్‌:
 

జియో ఫైబ‌ర్ యూజ‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేలా మ‌రో ఆఫ‌ర్‌:

JioFiber కస్టమర్‌లు తమ కొత్త కనెక్షన్‌ను ఆగస్టు 12 నుండి ఆగస్టు 16 మధ్య బుక్ చేసుకుంటే 15 రోజుల అదనపు సర్వీస్‌ను పొందుతారు. అయితే అది ఆగస్ట్ 19లోగా యాక్టివేషన్ పూర్తి కావాలి. ఈ ఆఫర్‌ను కోరుకునే కస్టమర్‌లు రూ.499, రూ.599, రూ.799, లేదా రూ.899 విలువైన JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కోసం వెళ్లవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఇది 6 లేదా 12 నెలల ప్లాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత క‌లిగిన‌ కస్టమర్‌ల కోసం, Jio కంపెనీ యూజ‌ర్ల‌కు MyJio యాప్‌లో డిస్కౌంట్ క్యాష్ వోచర్‌ను ఇస్తుంది.

చివ‌ర‌గా జియో రూ.2999 ప్లాన్‌:

చివ‌ర‌గా జియో రూ.2999 ప్లాన్‌:

ఈ ఆఫర్‌ను జియో కొన్ని రోజుల క్రితం ప‌రిచ‌యం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం 2022 ఆఫర్ లో భాగంగా, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే జియో వినియోగదారులు సాధార‌ణ ప్ర‌యోజ‌నాల‌తో పాటు.. 75GB అదనపు డేటాతో పాటుగా, రూ.750 విలువైన ఇక్సిగో Ixigo కూపన్, రూ.750 విలువైన నెట్‌మెడ్స్ కూపన్ మరియు రూ.750 విలువైన Ajio అజియో కూపన్‌లను పొందుతారు.

రిలయన్స్ జియో 2022 స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ పూర్తి వివరాలు:
రిలయన్స్ జియో టెలికాం సంస్థ రూ.2999 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2022 ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2.5GB రోజువారీ డేటాను పొందుతారు. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలు పొందుతారు. రోజువారీ డేటా వినియోగం తర్వాత వినియోగదారుల 64 Kbps వేగంతో డేటాను యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

అంతేకాకుండా, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో జియో అందిస్తున్న ఎంట్రీ లెవెల్ ప్లాన్ గురించి కూడా తెలుసుకుందాం:

అంతేకాకుండా, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో జియో అందిస్తున్న ఎంట్రీ లెవెల్ ప్లాన్ గురించి కూడా తెలుసుకుందాం:

భార‌త దేశంలోనే అతిపెద్ద టెల్కో రిల‌య‌న్స్ Jio కంపెనీ రూ.399 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కంపెనీ 30ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 3.3టీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా, వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని పొందవచ్చు.

 

Best Mobiles in India

English summary
Jio 3 New Offers: Rs 750 Plan with 2GB Daily Data for 90 Days and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X