Home
News

జియో అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే 500GB డేటా.. కొన్ని గంటలే ఛాన్స్.. మిస్ అవ్వకండి!

Jio offers: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని జియో, రూ.2025 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 200 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏకంగా 500GB డేటాను అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ 2025, జనవరి 31తో ముగుస్తుంది. ఎక్కువ కాలం లేదా వ్యాలిడిటీతో, ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులు. 5G యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా (5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే) లభిస్తుంది. 4G యూజర్లకు రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా అంటే 200 రోజుల్లో మొత్తం 500GB డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్ (లోకల్, STD) అపరిమితంగా చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు పంపించుకోవచ్చు.

Jio 500GB Data Plan Discontinues In A Few hours  Recharge Now

* అదనపు ప్రయోజనాలు

జియోసినిమాలో 10,000 కంటే ఎక్కువ సినిమాలు, లైవ్ స్పోర్ట్స్, వినోదాన్ని చూడవచ్చు. ప్రీమియం కంటెంట్ మాత్రం ఉండదు. జియోటీవీలో 800+ టీవీ ఛానెల్స్, 100+ HD ఛానెల్స్ వివిధ భాషల్లో చూడవచ్చు. జియోక్లౌడ్‌ కూడా ఫ్రీగా యాక్సెప్ట్ చేయవచ్చు. ఇందులో ఫైల్స్, కాంటాక్టులను బ్యాకప్ లేదా స్టోర్ చేసుకోవచ్చు.

రూ.2,150 విలువైన కూపన్లు మీ సొంతం

జియో కంపెనీ ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు అదనంగా డిస్కౌంట్ కూపన్లను కూడా అందిస్తోంది. ఈ కూపన్లను మీరు మైజియో యాప్ ద్వారా పొందవచ్చు. అవేంటో చూద్దాం. అందులో మొదటిది రూ.500 Ajio కూపన్, రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై ఈ కూపన్ వర్తిస్తుంది.

రెండోది 150 స్విగ్గీ డిస్కౌంట్, రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. మూడవది విమాన టిక్కెట్లపై రూ.1,500 తగ్గింపు, ఈజ్‌మైట్రిప్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు లభిస్తుంది.

* జనవరి 31 చివరి తేదీ

ఈ ఆఫర్ కొద్ది గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రీఛార్జ్ చేసుకోవడానికి చివరి తేదీ 2025, జనవరి 31. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారు ఈ ఆఫర్‌ను వెంటనే ఉపయోగించుకోండి.

* ఆ రెండు పాపులర్ ప్లాన్స్‌ తొలగింపు..

ఇదిలా ఉండగా భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రెండు పాపులర్ ప్లాన్స్‌ను తొలగించింది. మొదటిది, రూ.189 ప్లాన్. ఇది జియో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఎంట్రీ-లెవల్ ప్లాన్. 2024 జులైలో టారిఫ్ ధరలు పెరగకముందు ఈ ప్లాన్ ధర రూ.155 ఉండేది.

కానీ, ఇప్పుడు ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. ఇక రెండోది, రూ.479 ప్లాన్. వాయిస్, SMS-మాత్రమే ఉన్న ప్లాన్స్ వచ్చిన తరువాత ఈ ప్లాన్‌ను కూడా జియో తీసేసింది. చాలామంది ఈ ప్లాన్లకు రీఛార్జ్ చేసుకుంటూ వస్తున్నారు. వీటిని మనీ సేవింగ్ ప్లాన్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఇవి రెండు పోవడం వారికెంతో నిరాశ కలిగిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio offers a Rs 2025 plan with 500GB data, 200-day validity, unlimited calls, and SMS. It includes JioCinema, JioTV, JioCloud benefits and coupons worth ₹2150. Offer ends Jan 31, 2025.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X