JioPhone వాడుతున్నారా!! అయితే ఈ కొత్త ప్లాన్‌ మీద ఓ లుక్ వేయండి...

|

రిలయన్స్ జియో సంస్థ కొత్త జియోఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ప్రస్తుతం రెండు ప్లాన్‌లను అందిస్తున్నది. అలాగే ప్రస్తుత జియోఫోన్ కస్టమర్లకు కూడా రూ.749 ధర వద్ద కొత్తగా ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జియోపోన్ ను కొనుగోలు చేసిన చందాదారుల సంఖ్య కేవలం మూడేళ్లలో 100 మిలియన్లను తాకిందని సంస్థ తెలిపింది. ఈ టెల్కో సంస్థ '2G-MUKT BHARAT' అనే కొత్త ఉద్యమాన్ని ప్రకటించింది. దీని కింద ఫీచర్ ఫోన్ వినియోగదారులను జియోఫోన్ వినియోగదారులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి జియో రూ.1,999 మరియు రూ.1,499 ధరల వద్ద రెండు ప్లాన్‌లను ప్రారంభించింది. అదే సమయంలో జియోఫోన్ 2021 ఆఫర్‌లో ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం జియో 749 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ధర వద్ద రీఛార్జ్ చేయడం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Jio 749 ప్లాన్ ప్రయోజనాలు

Jio 749 ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ 2021 ఆఫర్‌ను విశ్లేషనలో భాగంగా రిలయన్స్ జియో అందించే ప్రయోజనాలలో రూ.749 ధర వద్ద లభించే కొత్త ప్లాన్‌లో జియోఫోన్ వినియోగదారులకు ప్రతి నెలా 2GB హై-స్పీడ్ డేటాతో పాటు ఎటువంటి ఎఫ్‌యూపీ పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 12 నెలలు. ఈ ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన SMS ప్రయోజనాలను కూడా అందించవచ్చు కాని టెల్కో ఈ ప్రయోజనాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ ఆఫర్ మార్చి 1 నుండి అందుబాటులో ఉంటుంది. అలాగే వినియోగదారులు JioTV, JioCinema వంటి Jio యాప్ లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.

జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లు
 

జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో టెల్కో జియో749 ప్లాన్‌తో నెలకు 2GB డేటాను అందిస్తోంది. జియోఫోన్ యూజర్లు ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లలో భాగంగా రూ.75, రూ .125, రూ .155, రూ.185 ధరల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.75 జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్ 3GB డేటాను 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంతకుముందు రూ.49 ధర వద్ద జియోఫోన్ ప్లాన్‌ను అందించేది. ఇది 2GB 4G డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేసింది. రూ.49 ప్లాన్ ఇకపై అందుబాటులో లేనందున అందరూ కూడా రూ.75 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ను పరిశీలిస్తున్నారు.

జియో749 ప్లాన్‌ vs రూ .75 జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌

జియో749 ప్లాన్‌ vs రూ .75 జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌

జియోఫోన్ వినియోగదారులు ఒక సంవత్సరం పాటు రూ.75 ధర వద్ద లభించే ప్లాన్‌తో 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కేవలం 28 రోజులు మాత్రమే. దీని అర్థం ఒక్కొక్కటిగా రీఛార్జ్ చేస్తే సంవత్సరానికి 975 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే రూ.749 కొత్త ప్లాన్ కూడా ఒక సంవత్సరానికి అదే ప్రయోజనాలను అందిస్తుంది. కావున రూ.749 ధర వద్ద లభించే ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

Best Mobiles in India

English summary
Jio 749 Plan Offers Unlimited Calls and 24GB Data For 12 Months Validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X