జియో ఎయిర్‌ఫైబర్ స్పెషల్ ఆఫర్.. ఇన్‌స్టాలేషన్ ఛార్జీ లేకుండా రూ.1,111 ప్లాన్‌తో ఏకంగా 50 రోజుల వ్యాలిడిటీ!
జియో ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. ప్రస్తుతం 4G, 5G రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం జియో సూపర్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ను (Jio Airfiber) అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.1,111 ధరకే ఏకంగా 50 రోజులపాటు వినియోగించుకొనే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ కేవలం 5G వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
జియో ఎయిర్‌ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అయితే 3 నెలలు, 6 లేదా 12 నెలల ఫ్లాన్‌లను ఎంచుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ జియో ఎయిర్‌ఫైబర్ 50 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ (50 Days Validity Jio AirFiber Plan) గురించి కస్టమర్‌లకు సమాచారం అందిస్తోంది. అర్హులైన వినియోగదారులు బుకింగ్ చేసుకోవచ్చని చెబుతోంది.

OTT సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు :
జియో ఎయిర్‌ఫైబర్ రూ.1,111 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా 1Gbps డౌన్‌లోడ్ స్పీడ్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా ఓటీటీ OTT (Over The Top) ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు. వినియోగదారులను ఆకర్షించేందుకు 50 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది.
జియో ఎయిర్‌ఫైబర్ డేటా స్పీడ్ :
ప్రస్తుతం జియో ఫైబర్ సేవలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని జియో చెబుతోంది. భవిష్యత్‌లో ప్రతి నెలా 10 లక్షల ఇళ్లను చేరుకోవాలని లక్ష్యాంగా నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు 30Mbps, 100Mbps, 300Mbps, 500Mbps, 1Gbps వేగంతో డేటాను అందిస్తాయి.
తక్కువ ధరలో రూ.599 ప్లాన్ :
ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్‌లో తక్కువ ధరలో రూ.599 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 30Mbps వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు. నెలవారీ 1000GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 800+ టీవీ ఛానళ్లు, 12 OTT ప్లాట్‌ఫాంల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సహా :
దీంతోపాటు జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు 3, 6, 12 నెలల వ్యాలిడిటీతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే రీఛార్జ్ ప్లాన్ ధరతోపాటు GST ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. 300Mbps కంటే ఎక్కువ వేగంతో డేటాను అందించే ప్లాన్‌లు మ్యాక్స్ కేటగిరీగా విభజించారు. ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు ఇతర ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెంపు ప్రభావం :
ఈ సంవత్సరం జులై నెలలో ఎయిర్‌టెల్, Vi తోపాటు జియో కూడా మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది. దీంతో అనేక మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జియో భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రాయ్ వెల్లడించింది.
ట్రాయ్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో జియో నెట్‌వర్క్ 79.6 లక్షల యూజర్లను కోల్పోయింది. ఆగస్టు నెలలో 40.1 లక్షలు, అదే జులై నెలలో 7.5 లక్షల వినియోగదారులను కోల్పోయింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి జియో సుమారు 46.37 కోట్ల యూజర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications