Home
News

1Gbps ఇంటర్నెట్ స్పీడ్ తో జియో AirFiber ! జియో 5G సిమ్ ని వాడవచ్చు!

By Maheswara

కరోనా సమయం లో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా మరియు OTT ల ఛానెళ్ల కారణంగా ఇళ్లలో కూడా ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. ఇంతవరకు ఇళ్లలో సాధారణ ఫైబర్ మరియు లేదా బ్రాడ్ బ్యాండ్ సేవలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు జియోతన కొత్త AirFiber తో ఈ పరిస్థితులను మార్చనుంది.

మీకు మీ ఇంటి వద్దే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలంటే, Jio నుంచి లాంచ్ కాబోతోన్న కొత్త AirFiber కోసం మరికొన్ని రోజులు వేచి ఉండండి. ఇది వైర్‌లెస్ పరికరాలకు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది మరియు దీని ద్వారా మీరు 1 Gbps లలో ఇంటర్నెట్ స్పీడ్ (జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్) ని పొందవచ్చు.

Jio AirFiber With Wireless 5G Wifi Services In Gbps Speed Expected To Launch Soon. Full Details Here.

రిలయన్స్ జియో గత సంవత్సరం (2023) లో జరిగిన దాని AGM సమావేశంలో ఈ ఎయిర్‌ఫైబర్‌ ను పరిచయం చేసింది మరియు ఇప్పుడు ఈ టెక్నాలజీ ని భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. టెలికాం ప్రపంచంలో రాబోయే ఈ కొత్త టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

జియో ఎయిర్‌ఫైబర్ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
Jio AirFiber అనేది ఎటువంటి వైర్ కనెక్షన్లు లేకుండా గాలిలో వైర్ లెస్ టెక్నాలజీ తో నే ఫైబర్ లాంటి వేగాన్ని అందజేస్తుందని టెలికాం దిగ్గజం పేర్కొంది. దీని సెటప్ కూడా చాల సులభంగా ఉంటుందని, మీరు చేయాల్సిందల్లా పరికరాన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేసి వేగవంతమైన ఇంటర్నెట్ ని ఉపయోగించవచ్చు.

ఈ AirFiber మీకు ట్రూ 5G ని ఉపయోగించడం ద్వారా అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌ సేవలను మీ ఇంట్లో వ్యక్తిగత Wi-Fi హాట్‌స్పాట్‌ ద్వారా పొందుతారు. ఈ కొత్త టెక్నాలజీ తో మీరు సాధారణ ఫైబర్ యొక్క Mbps వేగం కంటే ఎక్కువగా Gbps లో ఇంటర్నెట్ వేగం ఉంటుంది. దీని ద్వారా మీ ఇల్లు లేదా కార్యాలయంలో త్వరగా ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడం సులభంగా ఉంటుంది.

జియో ఎయిర్ ఫైబర్‌లో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి,
ప్రస్తుతం వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే 5G ఇంటర్నెట్‌ను వాడుతున్నారు, ఈ AirFiber యొక్క కొత్త సేవలతో, వినియోగదారులు మీ ఇంటిలోని ఇతర అన్ని స్మార్ట్ పరికరాలలో కూడా సరికొత్త మరియు వేగవంతమైన ఇంటర్నెట్ ను ఉపయోగించగలుగుతారు.

వినియోగదారులు ఈ తాజా AirFiber ని ఎలా వాడలి?
వినియోగదారులు Jio AirFiber పరికరం లో కొత్త 5G SIMని ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలను ఉపయోగించవచ్చు. ఇది ఇతర JioFiber సర్వీస్ లాగానే పని చేస్తుంది కానీ మరింత ఎక్కువ వేగంతో ఉంటుంది.

వినియోగదారులు జియో ఎయిర్ ఫైబర్ లో రెండు ఆప్షన్లను పొందుతారు మీరు కేబుల్‌ని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ ని కనెక్ట్ చేయవచ్చు. లేదా వైర్‌లెస్ ద్వారా కూడా ఇంటర్నెట్ ని కనెక్ట్ చేయవచ్చు. ఇంకా, ఈ వైర్‌లెస్ జియో ఎయిర్ ఫైబర్ పరికరాన్ని ఒక చోటు నుంచి మరోచోటుకి ఎక్కడికైనా సులభంగా మార్చవచ్చు. Jio వెబ్‌సైట్‌లో దీని లాంచ్ గురించి ఏమీ ప్రస్తావించనప్పటికీ, ఈ సంవత్సరం రెండవ సగం నాటికి ఈ సేవలు మార్కెట్లోకి వస్తాయని అంచనాలున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio AirFiber With Wireless 5G Wifi Services In Gbps Speed Expected To Launch Soon. Full Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X