Home
News

RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

భారతీయ టెలికాం పరిశ్రమ ప్రస్తుతం గందరగోళ స్థితిలో ఉంది. గత ఏడాది చివరినాటికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్-ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఈ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక నష్టాల నేపథ్యంలో వారి ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క టారిఫ్ ధరల రేట్లను పెంచారు.

రీఛార్జ్ ప్యాక్‌

కొత్తగా వచ్చిన ప్లాన్లు ఇప్పుడు ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ చర్య చందాదారులలో గందరగోళాన్ని సృష్టించింది మరియు రీఛార్జ్ ప్యాక్‌లను ఎంచుకోవడం కూడా వారికి కొంచెం కష్టతరం చేసింది.

 

 

 ప్రీపెయిడ్ ప్లాన్

ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ టెలికాం ఆపరేటర్లు రూ.50 నుండి రూ.2000 వరకు వివిధ ధరల విభాగాలలో తమ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీరు 200 రూపాయల లోపు పొందగలిగే జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ నుండి ఉత్తమమైన రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

రూ.200ల లోపు గల వోడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రూ.200ల లోపు గల వోడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్-ఐడియా రూ .149 ప్లాన్

వోడాఫోన్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను 28 రోజుల చెల్లుబాటుతో దాని మొత్తం వాలిడిటీలో 2 జిబి డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ మొత్తం కాలంలో 300 SMSలను అందిస్తుంది. ఇది చందాదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ఇవ్వబడుతుంది. ఈ ప్యాక్‌లోని అదనపు ప్రయోజనాలలో వోడాఫోన్ ప్లే మరియు ZEE5 స్ట్రీమింగ్ సర్వీసులకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

 

వోడాఫోన్-ఐడియా రూ.199 ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ.199 ప్లాన్

వొడాఫోన్ రూ.199 ప్లాన్ 21 రోజుల వాలిడిటీతో రోజుకు 1GB డేటాను అందిస్తోంది. అంతేకాకుండా ఈ రీఛార్జ్ ప్యాక్ రోజువారీ 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. ఇది చందాదారులకు ఎటువంటి FUP పరిమితి లేకుండా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్‌లో అదనపు ప్రయోజనాలు మునుపటి రూ.149 ప్లాన్ మాదిరిగానే వోడాఫోన్ ప్లే మరియు ZEE5 స్ట్రీమింగ్ సర్వీసులకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

 

 

ఎయిర్‌టెల్ రూ .149 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .149 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.200 లలోపు కేవలం ఒకే ఒక ప్లాన్ ను అందిస్తున్నది. వోడాఫోన్ ప్యాక్ మాదిరిగానే ఎయిర్‌టెల్ యొక్క రూ.149 ప్లాన్ కూడా ఇలాంటి ప్రయోజనాలను అందిస్తోంది. ఇది చందాదారులకు 28 రోజుల మొత్తం వాలిడిటీలో 2 జిబి డేటాతో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.ఇది చందాదారులకు ఎటువంటి FUP పరిమితి లేకుండా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.149 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ అందిస్తున్న అదనపు ప్రయోజనాలలో వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ కు ఉచిత యాక్సిస్ వంటివి ఉన్నాయి.

రిలయన్స్ జియో రూ.149 ప్లాన్

రిలయన్స్ జియో రూ.149 ప్లాన్

రిలయన్స్ జియో రూ.200 లలోపు రెండు ప్లాన్ లను అందిస్తున్నది. ఇందులో రూ.149 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 24 రోజుల వాలిడిటీతో రోజుకు 1 జిబి డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అన్ని జియో నంబర్లకు అపరిమిత కాలింగ్ మరియు నాన్-జియో నంబర్లకు 300 నిమిషాల కాల్ క్యాప్ తో వస్తుంది. రూ.149 ప్యాక్ రోజుకు 100SMSలను మరియు అన్ని జియో యాప్స్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది.

 

 

రిలయన్స్ జియో రూ.199 ప్లాన్

రిలయన్స్ జియో రూ.199 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ.199 ప్లాన్ తన చందాదారులకు రోజుకు 1.5 జిబి డేటాతో పాటు రోజువారీ 100 SMSలను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్యాక్ యొక్క చెల్లుబాటు 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ని రకాల జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ను ఉంచితంగా పొందుతారు. అయితే Jio యొక్క ప్రణాళిక నిజంగా అపరిమిత కాలింగ్‌తో రాదు. బదులుగా వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా అన్ని జియో నంబర్లకు అపరిమిత కాలింగ్ మరియు నాన్-జియో నంబర్లకు ఆఫ్-నెట్ కాలింగ్ కింద 1000 నిమిషాల FUP ని కలిగి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Jio, Airtel and Vodafone Offers Best Recharge Plans Under RS.200
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X