Home
News

IPL 2020 వీక్షణ కోసం Airtel, Jio కొత్త  ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!!!

ఇండియాలోని టెలికామ్ రంగంలో మొదటి రెండు వైర్‌లెస్ ఆపరేటర్లు అయిన జియో మరియు ఎయిర్‌టెల్ సంస్థలు వారి యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ ప్యాక్‌లపై డిస్నీ + హాట్‌స్టార్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు బేస్ ను కలిగిన జియో ఆపరేటర్ సెప్టెంబర్‌లో డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంను అనేక ప్రీపెయిడ్ ప్యాక్‌లతో అందిస్తున్నది. ఎయిర్‌టెల్ కూడా జియో మాదిరిగానే తన ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంలో డిస్నీ + హాట్‌స్టార్ VIP ను చేర్చి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు టెలికం ఆపరేటర్లు డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క OTT ప్రయోజనంతో తమ వినియోగదారులకు అందిస్తున్న ఉత్తమ ప్రీపెయిడ్ ప్యాక్‌ల జాబితా వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ + హాట్‌స్టార్ VIPకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్న జియో ప్లాన్ లు

డిస్నీ + హాట్‌స్టార్ VIPకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్న జియో ప్లాన్ లు

56 రోజుల మొత్తం వాలిడిటీ కాలంలో 112GB డేటాను అందిస్తున్న రూ.598 జియో ప్లాన్‌ వినియోగదారులకు 2000FUP నిమిషాల నాన్- జియో కాల్స్ మరియు జియో- జియో అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనంతో పాటుగా వినియోగదారులకు 2GB రోజువారీ డేటా ప్రయోజనంను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 100SMS లతో పాటుగా జియో యొక్క  యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా పొందుతారు. ఈ ప్యాక్‌తో ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క ఉచిత చందాను అదనంగా పొందవచ్చు.

జియో రూ 777 ప్లాన్

జియో రూ 777 ప్లాన్

డ్రీమ్ 11 ఐపిఎల్‌ను ఉచితంగా చూడటానికి జియో వినియోగదారులు పొందగల రెండవ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.777 ప్లాన్. ఈ ప్లాన్ కూడా డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా ప్రయోజనంను ఉచితంగా అందిస్తుంది. ఇది 84రోజుల చెల్లుబాటుతో మొత్తంగా వాలిడిటీ కాలంలో 131GB డేటాను అందిస్తుంది. ఇందులో వినియోగదారులు 1.5GB రోజువారీ డేటాతో పాటుగా బోనస్ గా 5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత జియో-టు-జియో కాల్స్ మరియు  3000 FUP నిమిషాల జియోయేతర కాల్‌ల ప్రయోజనం అందిస్తుంది. వీటితో పాటుగా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా ఉన్నాయి. వినియోగదారులు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

డిస్నీ + హాట్‌స్టార్ VIPకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్ లు

డిస్నీ + హాట్‌స్టార్ VIPకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్ లు

భారతి ఎయిర్‌టెల్ నుండి లభించే రూ.448 ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. దీని యొక్క చెల్లుబాటు కాలం  తక్కువగా ఉన్నప్పటికీ వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటా ప్రయోజనంను పొందుతారు. వినియోగదారులు రోజుకు 100SMSలను కూడా పొందుతారు. OTT విభాగంలో వినియోగదారులు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క ఉచిత సభ్యత్వాన్ని ఒక సంవత్సరం కాలానికి పొందుతారు.

ఎయిర్టెల్ రూ .599 ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్టెల్ రూ .599 ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్టెల్ నుండి లభిస్తున్న రూ .599 ప్లాన్ కూడా వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ విఐపి యొక్క చందాను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాతో పాటు భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.448 ప్లాన్ అందించే దానికంటే రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio, Airtel New Prepaid Plans Offers Disney+ Hotstar Free Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X