Jio, Airtel పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లు!! 3 సభ్యులకు అందుబాటు ధరలో ఎక్కువ ప్రయోజనాలు

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల జియో మరియు ఎయిర్టెల్ టెల్కోలు తన యొక్క వినియోగదారులకు చౌకైన ధరలో అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీటితో పాటుగా ఖరీదైన ధర ట్యాగ్‌లతో లభించే ప్లాన్ లు కూడా యూజర్ల యొక్క మొత్తం కుటుంబంకి అవసరమైన ప్రయోజనాలను అందిస్తాయి. కేవలం ఒక ధర ట్యాగ్‌తో వ్యక్తిగత కనెక్షన్‌లతో మొత్తం కుటుంబ కనెక్షన్‌లను పొందవచ్చు. అయితే టెల్కోలు అందించే కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు సరసమైన ధర ట్యాగ్‌లతో లభిస్తూ వాటికి తగిన ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ టెల్కోలు చిన్న సైజు కుటుంబంలోని యూజర్లకు సరసమైన ధర ట్యాగ్‌తో గొప్ప ప్రయోజనాలను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రిలయన్స్ జియో ఫ్యామిలీ ప్లాన్

రిలయన్స్ జియో ఫ్యామిలీ ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ వ్యక్తిగత మరియు కుటుంబ వినియోగదారుల కోసం అనేక రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో భాగంగా టెల్కో యొక్క అత్యంత ఆకర్షణీయమైన ఫ్యామిలీ ప్లాన్‌లలో ఒకటి రూ.799 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. రూ.799 ధర వద్ద లభించే ఈ ప్లాన్‌తో జియో రెండు అదనపు సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తుంది. అంటే ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఉన్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు మొత్తంగా 150GB డేటాను పొందుతారు. అంతేకాకుండా 200GB డేటా రోల్‌ఓవర్‌ను కూడా అనుమతిస్తుంది. 150GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 1GB కి రూ.10 ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అదనంగా జియో ఈ ప్లాన్ తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఒక సంవత్సరం మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా బహుళ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

జియో
 

రిలయన్స్ జియో అందించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను పొందాలని చూస్తున్న వినియోగదారులు MyJio యాప్‌ని ఉపయోగించి వారి స్వంత అభీష్టానుసారంగా కొత్త లేదా ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లను వారి ఫ్యామిలీ ప్లాన్‌లో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ముఖ్యమైన సబ్‌స్క్రైబర్ తన యొక్క MyJio యాప్‌తో సులభంగా చేర్చుకోవచ్చు. అంతేకాకుండా మెయిన్ సబ్‌స్క్రైబర్ తన యొక్క ఇష్టానుసారంగా కుటుంబ సభ్యులకు డేటా యొక్క కేటాయింపులను నిర్ణయించవచ్చు.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ఇన్ఫినిటీ ప్లాన్

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ఇన్ఫినిటీ ప్లాన్

ఎయిర్‌టెల్ టెల్కో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల విభాగంలో అత్యంత ఖరీదైన ఫ్యామిలీ ప్యాక్ రూ.1,599 ధరతో లభిస్తుంది. ఫ్యామిలీలో ముగ్గురు సభ్యులకు మిడ్-రేంజ్ ధరలో భాగంగా ఇన్ఫినిటీ 999 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ సంస్థ రూ.999 ధరతో అందించే ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200 GB వరకు రోల్‌ఓవర్‌తో 150 GB నెలవారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌తో కుటుంబ సభ్యుల కోసం 1 సాధారణ సిమ్ మరియు 2 ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌లను పొందుతారు. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినమ్ రివార్డ్‌లను కూడా అందిస్తుంది. ఇందులో అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అలాగే అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ VIP మెంబర్‌షిప్ కు ఉచిత యాక్సిస్ ఉంటుంది. ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ యాప్ ప్రీమియం, Wynk ప్రీమియం వంటి మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.1,099 కొత్త ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.1,099 కొత్త ప్లాన్ ప్రయోజనాలు

రూ.1,099 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు ఒకే కనెక్షన్ తో ఫైబర్+ల్యాండ్‌లైన్ మరియు DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫైబర్ కనెక్షన్‌తో ఇంటర్నెట్ స్పీడ్ ని 200 Mbps వరకు పొందవచ్చు అని టెల్కో వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది. అయితే ఈ ప్లాన్‌ను పొందడానికి ప్రాథమిక పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అవసరం ఉండకపోవచ్చు కావున ఇది మంచి విషయం అనిచెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు నిబంధనలు మరియు షరతులు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ ప్లాన్ ప్రయోజనాలలో లేనందున దానితో ఎటువంటి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ప్రమేయం లేనట్లు కనిపిస్తోంది. ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ మొబైల్ సేవలను కాకుండా టెల్కో యొక్క ఫైబర్ మరియు DTH సేవలను వినియోగించాలనుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌లో రూ.350 విలువైన టీవీ ఛానెల్‌లు చేర్చబడ్డాయి. దానికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ రెండింటికీ ఒక-సంవత్సరంపాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను కూడా చేర్చబడింది. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు కొత్త సర్వీస్‌ను జోడించడం వల్ల వినియోగదారులు నెలకు రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Jio, Airtel Postpaid Family Plans !! More Benefits at an Affordable Price For 3 Members

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X