జియో, ఎయిర్‌టెల్ ద్వారా యాపిల్ వాచ్ 3 సిరీస్ భారత్‌లో విడుదల..

|

భారత్ మార్కెట్లో యాపిల్ వాచ్ రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ స్మార్ట్ గడియారాలను యాపిల్ దిగ్గజ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్ ద్వారా మార్కెట్లలో ప్రవేశపెడుతోంది. యాపిల్ వాచ్ సిరీస్ 3 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ గాడ్జెట్ ప్రీ బుకింగ్స్ మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మే 11 నుంచి ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రానుంది. జీయో డాట్ కామ్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, ఎయిర్‌టెల్ వెబ్ సైట్ లో బుకింగ్ చేసుకునే వీలుంది.

Jio and Airtels offer on Apple Watch Series 3: Everything you should know

ఈ వాచ్ ను ఐఫోన్ 6 ఎస్ సహా ఆపై మోడల్స్ కు కనెక్ట్ చేసుకునే వీలుంది. అలాగే జియో యూజర్లకు యాపిల్ వాచ్ నుంచి ప్రత్యేకంగా జీయో ఎవ్రీవేర్ కనెక్ట్ సర్వీస్ లభిస్తుంది. అంటే ఒకే జియో నెంబర్ ను అటు ఐఫోన్ లోనూ, అటాగే యాపిల్ స్మార్ట్ వాచ్ 3లో ఉపయోగించుకునే వీలుంది.

దీని కోసం ఐఫోన్ లోని యాపిల్ వాచ్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా జియో నెంబర్ ను కనెక్ట్ చేసుకునే వీలుంది. ఈ సుప్రీం సేవలకు రిలయన్స్ జియో నుంచి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే జియోలోని అన్ని ప్లాన్స్ పొందే వీలుంది. అలాగే ఈ వాచ్ హోం డెలివరీ కూడా చేసేందుకు జియో సిద్ధంగా ఉంది.

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

అలాగే ఎయిర్ టెల్ కూడా యాపిల్ వాచ్ 3 కోసం ఓ ప్రత్యేక ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఎయిర్ టెల్ మై ప్లాన్లోని పోస్ట్ పెయిడ్ యూజర్లు ఉచితంగా యాపిల్ వాచ్ 3లోకి మారే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే వాచ్ తో పాటు వచ్చే ఎలక్ట్రానిక్ సిమ్ నెంబర్ కూడా మీ ఐఫోన్ నెంబర్ నే ఎంపిక చేసుకునే వీలుంది.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వాటర్ ప్రూఫ్, సిరి సాఫ్ట్ వేర్, ఐ మ్యూజిక్, హెల్త్ గాడ్జెట్స్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Bharti Airtel and Mukesh Ambani-owned Reliance Jio are all set to sell Apple Watch Series 3 (GPS + Cellular) in India. Yes you heard it right and the pre-orders will start from May 4 on Jio.com, Reliance Digital stores, and Jio stores, and Airtel's website. The product will also be available in offline stores starting Friday, 11th May 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X