Home
News

Jio, Airtel, VI, BSNL అందించే ప్రత్యేక డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు ఇవే

ఇండియాలోని టెలికామ్ రంగంలో గల అన్ని టెలికాం సంస్థలు తన యొక్క వినియోగదారుల కోసం వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌తో ప్రీపెయిడ్ ప్యాక్‌లను అందించడంతో పాటుగా కేవలం డేటా ప్రయోజనంను మాత్రమే అందించే కొన్ని ప్రత్యేక ప్యాక్‌లను కూడా అందిస్తున్నాయి. ఇటువంటి ప్యాక్‌లు ఇప్పటికే వాయిస్ కాలింగ్ ప్రయోజనంను కలిగి ఉండి ఫెయిర్-యూజ్-పాలసీ (ఎఫ్‌యుపి) డేటాను అయిపోయిన వారికి అనుకూలంగా ఉంటాయి. బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) మరియు జియో సంస్థలు అన్నీ తమ వినియోగదారులకు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఈ టెల్కోలు తమ వినియోగదారులకు ఎంచుకోవడానికి అందిస్తున్న ఉత్తమమైన డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

రిలయన్స్ జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

రిలయన్స్ జియో తన వినియోగదారులకు వివిధ రకాల డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తున్నది. ప్రస్తుతం ఇంటి వద్ద నుండి పనిచేసే వారికి సహాయపడే ప్యాక్‌లు చాలానే ఉన్నాయి. హోమ్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లలో రూ.251 ధరతో లభించే ప్యాక్ 50GB FUP డేటాను 30 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఇవే కాకుండా నాలుగు డిస్నీ + హాట్‌స్టార్ ప్యాక్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ .612, రూ .1,004, రూ .1,206, రూ .1,208. ఇవి కాకుండా నాలుగు చౌక ప్యాక్‌లు కూడా ఉన్నాయి. ఇవి వరుసగా రూ.11 ప్యాక్ 800MB డేటాను రూ.21 ప్యాక్ 2GB డేటాను, రూ.51 ప్యాక్ 6GB డేటాను, రూ.101 ప్యాక్ 12GB డేటాను అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్‌ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

భారతి ఎయిర్‌టెల్‌ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

భారతి ఎయిర్‌టెల్‌ టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారులకు రెండు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను మాత్రమే అందిస్తున్నది. వీటి ధరలు వరుసగా రూ.401 మరియు రూ.48. రూ.48 ధర వద్ద లభించే డేటా వోచర్ 3GB ఎఫ్‌యూపీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.401 ధర గల డేటా వోచర్ 30GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అయితే రూ.401 వోచర్ 28 రోజుల చెల్లుబాటు కాలంతో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క OTT ప్రయోజనంను కూడా అదనంగా అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా (Vi) డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

వోడాఫోన్ ఐడియా (Vi) డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు పలు రకాల డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా అందిస్తుంది. వీటిలో మొదటిది 56 రోజుల చెల్లుబాటుతో 100GB డేటాను రూ.351 ధర వద్ద అందించే డేటా వోచర్. ఇందులో ‘Vi మూవీస్ & టీవీ' యొక్క అదనపు ప్రయోజనం కూడా ఉంది. రూ.251 ధర వద్ద లభించే డేటా యాడ్-ఆన్ ప్యాక్ 50GB డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. తక్కువ డేటాను కోరుకునే వినియోగదారులకు ఇది సరిపోతుంది. రూ.98 ప్యాక్ డబుల్ డేటా ఆఫర్ కింద ఇది ఇప్పుడు 6GBకి బదులుగా 12GB డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.

BSNL డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

BSNL డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ తన యూజర్లను మరింత ఆకట్టుకోవడానికి రూ.16 నుంచి రూ.1,098 వరకు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తున్నది. రూ.16 ధర వద్ద లభించే చౌకైన వోచర్‌ వినియోగదారులకు 1 రోజు చెల్లుబాటుతో 2GB డేటాను అందిస్తుంది. హోమ్ వోచర్ ‘Data_WHF_151' వోచర్ 40GB డేటాను 30 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అలాగే వినియోగదారులకు 2GB రోజువారీ డేటా మరియు అపరిమిత కాలర్ ట్యూన్ ఎంపికను ‘DATASTV_197' వోచర్ ప్యాక్ 54 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. చివరిగా ‘DATA_1098' డేటా ప్యాక్ 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత డేటాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Jio, Airtel, VI, BSNL Offers Special Data Add-on Packs: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X