గంటల తరబడి మాట్లాడే దమ్ముందా..అయితే ట్రై చేయండి
మాట్లాడుకున్నోళ్లకి మాట్లాడుకున్నంత అన్నట్లుగా సరికొత్త ఆఫర్లు
జియో రాకతో టెలికం మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దిగ్గజ టెల్కోలు ఉచిత ఆఫర్లతో ఓ సునామినే తలపిస్తున్నాయి. దాదాపు 84 రోజులు పాటు మాట్లాడుకున్నోళ్లకి మాట్లాడుకున్నంత అన్నట్లుగా సరికొత్త ఆఫర్లు దర్శనమిస్తున్నాయి. అవేంటో ఓ సారి మీరే చూడండి.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్
84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకి 1జిబి డేటా పొందవచ్చు. కాల పరిమితి 84 రోజులు. ఈ ఆఫర్ 4జీ హ్యాండ్‌సెట్స్ వాడుతున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

వొడాఫోన్ రూ. 352 ప్లాన్
84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకి 1జిబి డేటా పొందవచ్చు. కాల పరిమితి 84 రోజులు. ఎయిర్‌టెల్ ప్లాన్‌లో లేని అపరిమిత మెసేజ్ ఆఫర్ ఈ వొడాఫోన్ ప్లాన్‌లో ఉంది.

జియో రూ. 399 ప్లాన్
84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకి 1జిబి డేటా పొందవచ్చు. కాల పరిమితి 84 రోజులు. రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు.

బిఎస్ఎన్ఎల్ 429 ప్లాన్
BSNL అందిస్తునన్న ఈ ప్లాన్‌ను వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు.

అమెరికాకు దిమ్మతిరిగింది


Click it and Unblock the Notifications








