IPL 2020 లైవ్ మ్యాచ్‌ల కోసం టెల్కోల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!
ఇండియాలోని అతిపెద్ద స్పోర్ట్స్ టోర్నమెంట్లలో ఒకటి ఐపిఎల్ క్రికెట్. ఐపిఎల్ 2020 యొక్క హక్కులను డ్రీమ్ 11 కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే సెప్టెంబర్ 19 నుండి డ్రీమ్ 11 యొక్క ఐపిఎల్ 2020 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రేమికులు మరియు క్రీడాభిమానులు తమ యొక్క పనులను చూసుకుంటూ క్రికెట్ మ్యాచ్ యొక్క లైవ్ ను చూడాలని అనుకుంటారు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా క్రికెట్ అభిమానులు తమ యొక్క ఫోన్లలో మ్యాచ్ లను చూడడానికి గొప్ప అవకాశం ఉంది.

IPL లైవ్ మ్యాచ్లను చూడటానికి ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ముందుతరం వ్యక్తుల మాదిరి కాకుండా ఇప్పుడు లైవ్ మ్యాచ్లను చూడటానికి చాలా మంది టీవీలపై ఆధారపడ్డకుండా తమ యొక్క స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో క్రికెట్ ను చూస్తున్నారు. ఈ సంవత్సరం డ్రీమ్ 11 IPL 2020 యొక్క లైవ్ మ్యాచ్‌లను చూడాలనుకునే వారు డిస్నీ + హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ను ఉపయోగించవచ్చు. కానీ లైవ్ మ్యాచ్‌ను చూడడానికి మీకు రోజువారీ డేటా అవసరం అధికంగా ఉంటుంది. డ్రీమ్ 11 IPLను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి వివిధ సర్వీసు ప్రొవైడర్లు అన్ని కూడా ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నాయి వాటి వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు- డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఇటీవల కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇవి డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంను ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఉచితంగా అందిస్తాయి. కొత్త ప్లాన్‌లలో క్రికెట్ ప్యాక్ కూడా ఉంది. ఇది రూ.499 ధర వద్ద వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాతో మొత్తం చెల్లుబాటు కాలానికి 84GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాని ఇది వాయిస్ లేదా SMS ప్రయోజనాలను అందించదు. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్రయోజనంతో పాటు జియో యొక్క అన్ని రకాల యాప్ లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. కాబట్టి ప్రతి రోజు క్రికెట్ చూసే వారికి ఇది మంచి ప్రీపెయిడ్ ప్లాన్.

భారతి ఎయిర్‌టెల్ కూడా
భారతి ఎయిర్‌టెల్ కూడా తన యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఒక సంవత్సరం చెల్లుబాటు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను ఉచితంగా అందిస్తుంది. మీరు ఎయిర్‌టెల్ యొక్క వినియోగదారులు అయితే కనుక ఈ సంవత్సరం డ్రీమ్ 11 ఐపిఎల్‌ను చూడటానికి ఎయిర్టెల్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. కాబట్టి మీరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం విడిగా చందాను పొందడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనితో పాటు వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఫోన్ కాల్స్ మరియు రోజుకు 100SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో పాటు ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క ప్రయోజనాలను కూడా అదనంగా పొందుతారు.

వోడాఫోన్ యూజర్లు IPL లైవ్ మ్యాచ్‌ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వోడాఫోన్ యూజర్లు డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంను పొందే ఎటువంటి ప్రీపెయిడ్ ప్లాన్‌లు లేవు. కాబట్టి మీరు ఇప్పటికే హాట్‌స్టార్ యొక్క చందాను కలిగి ఉండాలి లేదా విడిగా చందాను పొందాలి. కానీ చందా పొందిన తర్వాత మీకు డేటా అవసరం అధికంగా ఉంటుంది. అందుకోసం వోడాఫోన్ అందిస్తున్న డేటా ప్రయోజనం మరొకరు అందివ్వడం లేదు. మీరు టెల్కో నుండి లభిస్తున్న రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక ఖచ్చితంగా సరిపోతుంది. ఇది ప్రస్తుతం వినియోగదారులకు అందిస్తున్న అసలు రోజువారి 2GB డేటాకు అదనంగా మరొక 2GB రోజువారీ డేటాను అందిస్తున్నది. కాబట్టి మీరు ప్రతిరోజూ 4GB డేటాను పొందవచ్చు. రోజులో రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ మీరు ఈ డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ వొడాఫోన్ ప్లే మరియు Zee5 ప్రీమియంలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications