రూ.200 కంటే తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే జియో. ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్‌లు..!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోండి. జియోహాట్‌స్టార్ ఓటీటీలో (Jiohotstar Subscription) క్రికెట్ మ్యూచ్‌లను వీక్షించేందుకు అవకాశం ఉంది. మరియు సినిమాలు, షో, ఇతర డాక్యుమెంటరీలను వీక్షించవచ్చు. దీంతో అనేక టెలికాం సంస్థలు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఇప్పటికే అనేక ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.
జియోహాట్‌స్టార్ ను రూ.149 తో రీఛార్జ్‌తో మూడు నెలల వరకు వినియోగించుకోవచ్చు. అదే రూ.1499 రీఛార్జ్‌తో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. టెలికాం సంస్థలు రూ.200 కంటే తక్కువ రీఛార్జ్ ప్లాన్‌లలోనూ జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. జియో రూ.200 కంటే తక్కువ ధరలో రెండు రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.100, రూ.195 ప్లాన్‌లు. ఈ రెండు యాడ్ ఆన్ డేటా ప్లాన్‌లుగా ఉన్నాయి.

జియో రూ.100 డేటా ప్లాన్ లో భాగంగా 5 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లతోపాటు ఇతర వీడియో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్‌లో కేవలం డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే పొందవచ్చు. ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
జియో రూ.195 ప్లాన్ లో 15GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
ఎయిర్‌టెల్ కూడా రూ.200 కంటే తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే రెండు ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.100, రూ.195 ప్లాన్‌లు. ఎయిర్‌టెల్ రూ.100 యాడ్ ఆన్ రీఛార్జ్ ప్లాన్‌లో 5GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ /టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.195 రీఛార్జ్ ప్లాన్ లో ఏకంగా 15GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ రెండు ప్లాన్‌లలో ఎటువంటి కాలింగ్, SMS లను అందించడం లేదు. వీటిని యాక్టివేట్ చేసుకొనేందుకు కచ్చితంగా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉండాలి.
వోడాఫోన్ ఐడియా తన యూజర్ల కోసం రూ.200 కంటే తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.101, రూ.151, రూ.169 ప్లాన్‌లో డేటాతోపాటు ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ మూడు ప్లాన్‌లు కూడా ఎటువంటి కాల్, SMS లను అందించడం లేదు.
Vi రూ.101 ప్లాన్ లో 5GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను 30 రోజుల్లోగా వినియోగించుకోవాలి. దీంతోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.151 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 4GB డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ను ఉపయోగించుకోవచ్చు.
రూ.169 వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా 30 రోజుల వ్యాలిడిటీతో 8GB డేటాను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇవి కేవలం డేటా ప్లాన్‌లు మాత్రమే, ఎటువంటి కాలింగ్, SMS లను అందించవు.


Click it and Unblock the Notifications








