బంగారం ప్రియులకు JIO శుభవార్త.. అక్షయ తృతీయ వేళ కొంటే 2% అదనపు బంగారం.. ఎలా పొందాలంటే?
Jio Akshaya Tritiya offer 2025: ఈ అక్షయ తృతీయ పండుగ వేళ, రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. జియోఫైనాన్స్ (JioFinance) యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేవారికి 2% వరకు అదనపు బంగారాన్ని ఉచితంగా అందిస్తోంది. "జియో గోల్డ్ 24K డేస్" పేరుతో వస్తున్న ఈ స్పెషల్ ఆఫర్, 2025, ఏప్రిల్ 29 నుంచి 2025, మే 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
* ఈ జియో గోల్డ్ 24K డేస్ ఆఫర్ ఏంటి..?
ఈ పండుగ ఆఫర్‌ను ఎలా సొంతం చేసుకోవాలో, మీ అక్షయ తృతీయ వేడుకలను మరింత లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ సింపుల్‌గా, క్లియర్‌గా తెలుసుకుందాం. "జియో గోల్డ్ 24K డేస్" ఆఫర్ సమయంలో, జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో (MyJio) యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే యూజర్లు అదనంగా ఉచిత బంగారం గెలుచుకోవచ్చు.

ఆఫర్ వివరాలు చూస్తే రూ.1,000 నుంచి రూ. 9,999 వరకు మొత్తంలో మీరు పెట్టుబడి పెడితే, చెక్అవుట్ సమయంలో JIOGOLD1 అనే ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఇలా చేస్తే మీకు 1% ఉచిత బంగారం లభిస్తుంది. రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ: మీ పెట్టుబడి రూ.10,000 దాటితే, JIOGOLDAT100 ప్రోమో కోడ్‌ను అప్లై చేయండి.
మీకు ఏకంగా 2% అదనపు బంగారం వస్తుంది. మీరు కొనుగోలు పూర్తి చేసిన 72 గంటల్లోగా ఈ ఉచిత బంగారం మీ డిజిటల్ గోల్డ్ అకౌంట్‌లో జమ అవుతుంది. బంగారం క్రెడిట్ అయిన వెంటనే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
* గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు..
ఈ ఆఫర్ కేవలం ఒకేసారి పెద్ద మొత్తంలో (లంప్-సమ్) డిజిటల్ గోల్డ్ కొనేవారికి మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లకు ఇది వర్తించదు. ఆఫర్ కాలంలో ఒక్కో యూజర్ గరిష్టంగా 10 సార్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒక యూజర్‌కు లభించే మొత్తం ఉచిత బంగారం విలువ రూ. 21,000 మించకూడదు.
* పాన్ వెరిఫికేషన్జియోఫైనాన్స్ యాప్‌లో రిజిస్టర్ అయి, పాన్ కార్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారు, ఇప్పటికే ఉన్న యూజర్లు అయినా, పాన్ వెరిఫికేషన్ పూర్తయితే చాలు. సరైన ప్రోమో కోడ్‌ను చెక్ఔట్ సమయంలో ఎంటర్ చేయాలి. లేకపోతే, పెట్టిన పెట్టుబడి ఆఫర్‌కు సరిపోయినా సరే, ఉచిత బంగారం మిస్ అవుతారు.
* అర్హత, లావాదేవీల నిబంధనలు
ఈ ఆఫర్‌కు అర్హత సాధించాలంటే, జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో (MyJio) యాప్ ద్వారానే బంగారం కొనాలి. పేమెంట్ కోసం UPI యాప్‌ను ఉపయోగించవచ్చు, అయితే, లావాదేవీ క్యాన్సిల్/ ఫెయిల్ అయినా, లేదా ఏదైనా కారణం వల్ల రీఫండ్ అయినా, ఆ లావాదేవీకి బోనస్ బంగారం రాదు. ఈ ఆఫర్ పొందాలంటే కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి.
* జియో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం, రీడీమ్ చేసుకోవడం ఎలా..?
జియో స్మార్ట్‌గోల్డ్ (Jio SmartGold)లో పెట్టుబడి పెట్టడం చాలా సింపుల్. జియోఫైనాన్స్ యాప్ ద్వారా మీరు కేవలం రూ.10తో కూడా డిజిటల్ గోల్డ్ కొనడం ప్రారంభించవచ్చు. మీరు కొన్న డిజిటల్ బంగారాన్ని మీకు కావాలనుకున్నప్పుడు అమ్ముకొని నగదుగా మార్చుకోవచ్చు లేదా ఫిజికల్ గోల్డ్‌గా (బంగారు నాణేలు లేదా ఆభరణాలు) కూడా రీడీమ్ చేసుకోవచ్చు.
మీ దగ్గర కనీసం 0.5 గ్రాముల డిజిటల్ బంగారం ఉంటే, దాన్ని 0.5 గ్రా, 1 గ్రా, 2 గ్రా, 5 గ్రా, 10 గ్రాముల బరువున్న బంగారు నాణేలుగా, ఆభరణాలుగా మార్చుకునే అవకాశముంటుంది. అంతేకాదు, బంగారం కొనడానికి ముందు, జియోఫైనాన్స్ యాప్‌లోనే బంగారం లైవ్ ధరలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయకు జియో అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ అవ్వకండి.


Click it and Unblock the Notifications