అమెజాన్ ప్రైమ్ OTT సబ్‌స్క్రిప్షన్‌తో జియో. ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ప్రస్తుతం సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గుతోంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను OTT లో చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓటీటీ యూజర్‌ల కోసం టెలికాం ప్రొవైడర్‌లు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను (Airtel OTT Recharge Plan) అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఫలితంగా కాలింగ్, డేటా సహా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే రీఛార్జ్ పైన పొందవచ్చు. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా, BSNL వంటి సంస్థలు ఓటీటీలతో కూడిన అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.
రీఛార్జ్ ప్లాన్‌ల వివరాలు :
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తో కూడిన వివిధ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను జియో (jio OTT Recharge Plans) , ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.838, రూ.1199 ప్లాన్‌లలో అమెజాన్ OTT ను వినియోగించుకోవచ్చు. అదే జియో రూ.1029 రీఛార్జ్ ద్వారా అమెజాన్ OTT ప్రయోజనాలను పొందవచ్చు.

* ఎయిర్‌టెల్ రూ.838 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లా్‌న్‌లో (Airtel Rs838 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 3GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
ప్లాన్ వ్యాలిడిటీ :
ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 56 రోజులపాటు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హాలోట్యూన్స్, ఎయిర్‌టెల్ Xstream ప్లే, అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
* ఎయిర్‌టెల్ రూ.1199 రీఛార్జ్ ప్లాన్..
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (Airtel Rs1199 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB 4GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ప్లాన్ వ్యాలిడిటీ :
దీంతోపాటు ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను (Amazon Prime) పొందవచ్చు. 84 రోజులపాటు వినియోగించుకోవచ్చు. వీటితోపాటు ఎయిర్‌టెల్ Xstream play లో మరిన్ని OTT ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు. మరియు ఉచితంగా హాలోట్యూన్స్ సహా అపోలో 24/7 ప్రయోజనాలను పొందవచ్చు.
* జియో రీఛార్జ్ ప్లాన్ :
మరో ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా అమెజాన్ OTT ప్రయోజనాలను అందిస్తోంది. రూ.1029 రీఛార్జ్ ప్లాన్‌లో (Jio Rs1029 Recharge Plan) 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలను వినియోగించుకోవచ్చు.
ప్లాన్ వ్యాలిడిటీ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








