Jio, Airtel సంస్థల యొక్క అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు, ప్రయోజనాలు ఇవే
రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థలు రెండూ బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి ప్రవేశించిన తరువాత వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టన్నుల కొద్దీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ప్రతి ప్లాన్ అందరికి ఉపయోగకరమైనదిగా రూపొందించబడింది. ఎంపిక చేసిన లేదా చాలా తక్కువ శాతం వినియోగదారులు కూడా ఉపయోగించడానికి వీలుగా కొన్ని ప్లాన్లు కూడా ఉన్నాయి. ఫైబర్ సేవల విషయానికి వస్తే రెండు కంపెనీలు భారతదేశంలో ఇప్పటికే చాలా బలమైన ఉనికిని సాధించాయి. ఈ రెండు కంపెనీలు ఒకదానికొకటి వేరియబుల్ తేడాలలో అధికంగా ఉండే ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు సంస్థల యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల మధ్య గల తేడాల గురించి వివరముగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు
రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారులకు టన్నుల కొద్ది ప్రయోజనాలతో అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేని మూడు ప్లాన్‌లను కూడా అదనంగా కంపెనీ అందిస్తుంది. ఈ ప్లాన్‌లకు నెలకు రూ.2,499, రూ.3,999, మరియు రూ.8,499 ఖర్చవుతాయి. ఈ ప్లాన్‌లు వరుసగా 500 Mbps మరియు 1 Gbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటా (3.3TB) తో వస్తాయి. అయితే రూ.8,499 ప్లాన్ మాత్రం వినియోగదారులకు 6.6TB డేటాను అందిస్తుంది. ప్రతి ప్లాన్‌లోను ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు కూడా అధికంగానే ఉన్నాయి. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ VIP, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని OTTలకు ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఉచిత యాక్సిస్ ను పొందుతారు. ఇంకా కనెక్షన్‌లో ఉచిత వాయిస్ కాలింగ్ కూడా ఉంది.

భారతి ఎయిర్‌టెల్ ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అందరికీ అందుబాటులో లేని వర్గంలో ఒకే ఒక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు రూ.3,999 ధర వద్ద లభించే ‘విఐపి' ప్లాన్. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ కనెక్షన్‌తో పాటుగా వినియోగదారులకు అపరిమిత డేటాను (3.3TB) అందిస్తుంది. ఎయిర్‌టెల్ నుండి లభించే ఈ ప్లాన్ 1 Gbps సిమెట్రిక్ స్పీడ్‌తో లభిస్తుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో OTT ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ OTT ప్రయోజనాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ VIP, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ తో పాటుగా ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో లేదా భారతి ఎయిర్‌టెల్ నుండి వచ్చే ప్లాన్‌లు వాటి ధరలలో GSTని కలిగి ఉండవని గమనించండి. కాబట్టి పేమెంట్ సమయంలో వినియోగదారులు 18% ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అందరికీ ఎందుకు లేవు?
ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండవు ఎందుకంటే అవి ఒక విధమైన యుటిలిటీని అందిస్తాయి. వినియోగదారులు ఎవరైనా తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తో గరిష్టంగా 300 Mbps డౌన్‌లోడ్ / అప్‌లోడ్ వేగం అవసరం అయిన వారు మరియు ఒకే వై-ఫై నెట్‌వర్క్‌తో అనేక మంది కనెక్ట్ అవ్వడానికి 300Mbps ప్లాన్ యొక్క మొత్తం డేటా లోడ్‌ను నిర్వహించగలదు. ఈ రెండు సంస్థల యొక్క 500 Mbps మరియు 1 Gbps ప్లాన్లు ఎక్కువగా వ్యాపారాలు లేదా కార్యాలయాలలో ఉపయోగించబడతాయి. ఇవి తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి అధిక ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. సగటు డేటా అవసరాలున్న సాధారణ వినియోగదారుడు 500 Mbps లేదా 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ఎంచుకోవడంలో అర్థం లేదు.


Click it and Unblock the Notifications








