జియోతో జతకట్టిన మైక్రోసాఫ్ట్, డిజిటల్ ఇండియాకు సై

By Gizbot Bureau
|

దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి రిలయన్స్ ఇండ‌స్ట్రీస్, మైక్రోసాఫ్ట్ తెర లేపాయి. ఈ రెండింటి కలయికతో డిజిటల్ ఇండియాకు ఊపు వచ్చింది. ఇప్పటికే జియోతో సంచలనం రేపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపు రేఖలు మరింత మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది.

 
Jio and Microsoft partner to launch cloud data centres in India

దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే 'అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు.

జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌

జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌

భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు జియో అధినేత పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500లకే అందించనున్నట్లు ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండ‌స్ట్రీస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ను వినియోగించి దేశ‌మంతా డేటా సెంట‌ర్ల‌ను విస్తరించ‌నుంది.

దేశం అంతటా డేటా సెంటర్లు

దేశం అంతటా డేటా సెంటర్లు

అమెజాన్.కామ్, ఆల్ఫాబెట్ గూగుల్ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లకు సవాలుగా జియో టెలికాం ఈ భాగ‌స్వామ్యం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పదేళ్ల కాలం పాటు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేసే జియో దేశం అంతటా డేటా సెంటర్లను నిర్మిస్తుందని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పారు. అన్ని భారతీయ భాషలు మాండలికాలకు స్పీచ్ రిక‌గ్నైజేష‌న్, నేచుర‌ల్ లాంగ్వేజ్ అండ‌ర్‌స్టాండింగ్ వంటి సాంకేతిక‌త‌, దేశంలో ఉన్న‌ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్ధ్యం త‌మ‌కు ఉంద‌ని ముకేష్ అంబానీ పేర్కొన్నారు.

వెబ్‌సైట్ హోస్టింగ్, డేటా స్టోరేజ్
 

వెబ్‌సైట్ హోస్టింగ్, డేటా స్టోరేజ్

క్లౌడ్ సర్వీసెస్ మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించడం ముఖ్యంగా వెబ్‌సైట్ హోస్టింగ్, డేటా స్టోరేజ్ వంటి కంప్యూటర్ సేవలను అమ్మడం - అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) ఆధిపత్యంలో ఉన్న భారతీయ మార్కెట్లో పోటీని తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. జయో ద్వారా ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలను ప్రారంభించడానికి, వినోద సేవలను అందించడానికి, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను నిర్మించడానికి ఇతర సేవ‌ల‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు.

రికార్డు వాయిస్ పంపిన సత్య నాదెల్ల

రికార్డు వాయిస్ పంపిన సత్య నాదెల్ల

రెండు సంస్థ‌లు క‌లిసి కంప్యూట్, స్టోరేజ్ నుంచి అనుసంధాన‌త‌, ఉత్పాదకత వరకు, దేశంలో ఉన్న చిన్న, మధ్యస్థ వ్యాపారాలకు సమగ్ర సాంకేతిక పరిష్కారాలను అందిస్తామని రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా రిలయన్స్ వాటాదారులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్ల తెలిపారు. ఇదిలా ఉంటే భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు అంబానీ పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Jio and Microsoft partner to launch cloud data centres in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X