ఓటీటీ లవర్స్‌కి సూపర్ ఆఫర్.. జియో, వీఐల రూ.175 ప్లాన్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్..
ఓటీటీ లవర్స్‌కు కనీవినీ ఎరుగని సూపర్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. జియో, వొడాఫోన్ ఐడియా (Vi) రెండూ కూడా మీ జేబుకు చిల్లు పెట్టకుండానే ఫుల్లుగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కేవలం రూ.175కే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని తీసుకొచ్చాయి.
ఈ ప్లాన్స్‌తో హై స్పీడ్‌తో ఇంటర్నెట్ డేటా వాడుకోవచ్చు, అంతేకాదు.. టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇష్టమైన కంటెంట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్స్‌లో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పదండి,

* జియో రూ.175 ప్రీపెయిడ్ ప్లాన్
జియో తక్కువ ధరలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవాళ్ల కోసమే ఈ రూ.175 ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ మైజియో యాప్, జియో అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఇప్పుడు ఫోన్‌పే వంటి వాటిలోనూ అందుబాటులో ఉంది. స్ట్రీమింగ్ చేసుకునేవాళ్లకి ఇది సూపర్ ఆప్షన్. కాల్స్ తో పని లేనివాళ్లకి ఈ ప్లాన్ బెస్ట్.
* ప్లాన్ ఫీచర్లు
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా: ఫుల్ స్పీడ్ తో 10GB డేటా (కాల్స్ చేసుకోవడానికి వీలు లేదు)
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్: ఏకంగా 12 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి 28 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్.
ఈ ప్లాన్‌లో ఉన్న ఓటీటీ యాప్స్ ఏవంటే సోనీ లివ్, ZEE5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కాంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, హోయిచోయ్. ఇవన్నీ 28 రోజులపాటు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు, ఇంకొద్ది రోజులు కావాలనుకుంటే మరోసారి ఇదే ప్లాన్ కు రీఛార్జ్ చేసుకోవచ్చు.
మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ వాడుతూ ఉంటే.. దానికి ఈ ప్లాన్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదా.. మీకు ఓన్లీ డేటానే కావాలి అనుకుంటే కూడా ఈ ప్లాన్ మీకు బాగా సెట్ అవుతుంది.
* వొడాఫోన్ ఐడియా (Vi) రూ.175 ప్లాన్
వొడాఫోన్ ఐడియా కూడా రూ.175కే అచ్చం ఇలాంటి ప్లాన్‌నే తీసుకొచ్చింది. సినిమా లవర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్ కోసం ఇది సూపర్ ఆప్షన్. Vi మూవీస్ & టీవీ యాప్‌లో ఈ ప్లాన్ ద్వారా బోలెడంత కంటెంట్ చూసేయొచ్చు.
* ప్లాన్ ఫీచర్లు
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా: ఫుల్ స్పీడ్ తో 10GB డేటా
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్: ఏకంగా 15కి పైగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్.
ఈ ప్లాన్‌లో ఉన్న కొన్ని ఓటీటీ యాప్స్ చూస్తే సోనీ లివ్, ZEE5, మనోరమమ్యాక్స్, ఫ్యాన్‌కోడ్, ప్లేఫ్లిక్స్. వీటితో పాటు వీఐ మూవీస్ & టీవీ యాప్‌లో చాలా ఉన్నాయి.
ఇంకా ఈ ప్లాన్‌లో 350+ లైవ్ టీవీ ఛానెల్స్ కూడా చూడొచ్చు. రకరకాల కంటెంట్ లైబ్రరీలు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
* మరిన్ని ఫీచర్లతో జియో ప్లాన్స్
ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఫీచర్లు కావాలి అనుకుంటే.. జియో దగ్గర రూ.329, రూ.1029, రూ.1049 ధరల్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎక్స్‌ట్రా డేటా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ యాక్సెస్ లాంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ సైతం ఉంటాయి. ఎక్కువ లాభాలు కావాలి అనుకుంటే ఈ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్.
తక్కువ ధరలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ పొందాలి అనుకునేవాళ్లకి జియో, వొడాఫోన్ ఐడియా రూ.175 ప్లాన్స్ మాత్రం సూపర్బ్ ఆప్షన్స్. మీరు సినిమా గీక్స్, వెబ్ సిరీస్‌లు చూస్తూ తెగ ఎంజాయ్ చేసేవాళ్లయితే.. లేదా లైవ్ టీవీ చూసే అలవాటు ఉంటే.. ఈ ప్లాన్స్‌ని ఒకసారి ట్రై చేసి చూడొచ్చు.


Click it and Unblock the Notifications








