జియో దీపావళి ధమాకా 2024 ఆఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్‌లపై రూ.3350 విలువైన ప్రయోజనాలు..!
దీపావళి పండుగ సందర్భంగా జియో తన యూజర్ల కోసం దీవాళి ధమాకా పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను (Jio Diwali Dhamaka 2024) ప్రకటన చేసింది. మూడు నెలల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మరియు వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో (Jio Annual Recharge Plan) రీఛార్జ్ చేసుకొనే యూజర్‌లు రూ.3350 విలువైన ఉచిత వోచర్‌లను పొందవచ్చని తెలిపింది. ఇప్పటికే దీపావళీ సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్ పైన ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియో దీవాళి ధమాకా ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, నవంబర్ 5 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.
రిలయన్స్ జియో ఆధారంగా (Jio Diwali Offers 2024) రూ.899 ప్రీపెయిడ్ రీఛార్జ్ ద్వారా 90 రోజులపాటు వ్యాలిడిటిని పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు ప్లాన్ మొత్తంలో భాగంగా అదనంగా 20GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

దీంతోపాటు జియో రూ.3599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. ఈ రిలయన్స్ జియో దీవాళి ధమాకా ఆఫర్ లో ఈ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా రూ.3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.3350 విలువైన వోచర్‌లు :
ఇందులో రూ.3000 విలువైన Easemytrip హోటళ్లు, ఎయిర్ ట్రావెల్ వోచర్ లను పొందవచ్చు. దీంతోపాటు రూ.200 విలువైన Ajio వోచర్ ను పొందవచ్చు. ఈ వోచర్ ను రూ.999 కంటే ఎక్కువ కొనుగోళ్లపై వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.150 Swiggy వోచర్ కూడా పొందవచ్చు.

దీపావళి సందర్భంగా జియో మరో ఆఫర్ ను కూడా ప్రకటన చేసింది. ఇందులో భాగంగా సంవత్సరం పాటు ఉచిత AirFiber మరియు రూ.2222 విలువైన ప్లాన్ ద్వారా 800 TV ఛానళ్లు, 13 OTT యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీపావళి సందర్భంగా రిలయన్స్ డిజిటల్ స్టోర్ లలో రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు చేసిన కస్టమర్ లకు సంవత్సరం పాటు ఉచిత AirFiber ను పొందవచ్చు.
ఈ దీపావళీ ఆఫర్ లో భాగంగా నెలవారీ రీఛార్జ్ కు సమానమైన 12 కూపన్ లను పొందవచ్చు. ఫలితంగా ఉచితంగా ఎయిర్ ఫైబర్ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.2,222 ఎయిర్ ఫైబర్ ప్లాన్ ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ గడువు మూడు నెలలపాటు ఉంటుంది.
1000GB డేటా, 13 OTT సబ్‌స్క్రిప్షన్‌లు :
ఈ ప్లాన్‌లో భాగంగా వైఫై రూటర్, 4K ఆండ్రాయిడ్ బాక్స్, 30Mbps వేగంతో 1000GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 800 + లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. మరియు వైఫై ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను పొందవచ్చు. వీటితోపాటు 13 OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








