RIL AGM 2021 లో జియో మొదటి ఆండ్రాయిడ్ 4G స్మార్ట్‌ఫోన్ ప్రకటించబడింది!! వివరాలు ఇవిగో
గూగుల్ సహకారంతో ఇండియా యొక్క టెలికాం సంస్థ జియో తయారుచేసిన తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ - జియోఫోన్ నెక్స్ట్‌ను RIL AGM 2021 వర్చువల్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. AGM వర్చువల్ ఈవెంట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ "అత్యంత సరసమైన" స్మార్ట్‌ఫోన్ గా దీనిని సంబోదించాడు. టచ్ స్క్రీన్ ఎనేబుల్ మరియు అత్యంత ఆప్టిమైజ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 10 న వినాయక చవితి సందర్భంగా భారతదేశంలో అందుబాటులోకి రానున్నది అని తెలిపారు. జియోఫోన్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) జియో ఆండ్రాయిడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను ముఖేష్ అంబానీ ప్రకటించారు. గత సంవత్సరం ప్రకటించిన రిలయన్స్ జియో మరియు గూగుల్ మధ్య భాగస్వామ్యం ఫలితంగా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది అని ముఖేష్ అంబానీ మరియు గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్ ఇద్దరూ వెల్లడించారు. ప్రజలను ఆకర్షించడానికి ఇది ఎంట్రీ లెవల్ హార్డ్‌వేర్ పైన ఆప్టిమైజ్ చేయబడి ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ మరియు వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ యొక్క ఆటోమేటిక్ రీడ్ మరియు లాంగ్వేజ్ ట్రాన్సలేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ AGM సమావేశంలో మాట్లాడుతూ "భారతదేశంలో ఇంకా 2G సేవలను ఉపయోగించే మొబైల్ వినియోగదారులు దాదాపు 300 మిలియన్ల మంది ఉన్నారు. వీరు ఇప్పటికి 2G సేవలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఎందుకంటే ప్రాథమిక 4G స్మార్ట్‌ఫోన్ కూడా ఈ వినియోగదారులకు భరించలేనిది. గత సంవత్సరం గూగుల్ మరియు జియో సంస్థలు కలిసి తరువాతి తరం మరియు ఫీచర్-రిచ్ కానీ చాలా సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడం గురించి సుందర్ గారు మరియు నేను మాట్లాడాము అని తెలిపారు. ఈ ఫోన్ యొక్క అనేక ఫీచర్స్ వెల్లడయ్యాయి. దీనితో పాటుగా ప్రారంభ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 10. అయితే ఈ ఫోన్ ధర ఇంకా ప్రకటించబడలేదు. ఇది "భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్" అవుతుంది.

సరసమైన స్మార్ట్‌ఫోన్‌తో పాటు 2G నుండి 4G కనెక్టివిటీకి అప్‌గ్రేడ్ చేయాలనుకునే వ్యక్తుల కోసం జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ను రూపొందించబడింది. ఈ కొత్త సమర్పణ కస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా జియో కోసం గూగుల్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వాయిస్ అసిస్టెంట్‌తో ప్రీలోడ్ చేయబడింది మరియు స్క్రీన్ టెక్స్ట్ యొక్క ఆటోమేటిక్ రీడ్-అలౌడ్, లాంగ్వేజ్ ట్రాన్సలేషన్ మరియు రియాలిటీ ఫిల్టర్‌లతో కూడిన కెమెరా ఫీచర్లను అందిస్తుంది. ఇది సాధారణ ఆండ్రాయిడ్ అప్ డేట్ల మద్దతుతో వస్తుంది.

గత ఏడాది జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ సంస్థ సుమారుగా రూ.33,737 కోట్ల పెట్టుబడులను పెట్టింది. గూగుల్ యొక్క ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగమైన ఆ ఒప్పందంలో భాగంగా సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను నిర్మించే ప్రణాళిక కూడా ఉంది.

జియో సంస్థ తన వినియోగదారుల కోసం తన హోమ్ హ్యాండ్‌సెట్‌ను తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు. ఈ టెల్కో జూలై 2017 లో జియో ఫోన్‌ను 4G కనెక్టివిటీతో స్మార్ట్ ఫీచర్ ఫోన్‌గా పరిచయం చేసింది. ఆ మోడల్ జియో ఫోన్ 2 ప్రారంభించడంతో 2018 లో అప్ డేట్ ను అందుకుంది. అప్‌గ్రేడ్‌లో QWERTY కీబోర్డ్ మరియు అసలు ఫోన్‌లో విస్తృత స్క్రీన్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications