Jio న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ 2025.. 200 రోజుల వ్యాలిడిటీ, 500GB హైస్పీడ్ డేటా, రూ.2150 విలువైన కూపన్‌లు..!
త్వరలో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ జియో (Reliance Jio) .. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటన చేసింది. ఈ రీఛార్జ్‌లో భాగంగా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కాల్, డేటా, SMS సహా ఇతర కూపన్‌లను అందిస్తోంది. న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ 2025 (Jio New Year Welcome Plan 2025) పేరుతో లాంచ్ చేసింది. దీపావళి సమయంలోనూ జియో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా రూ.2150 విలువైన కూపన్లను పొందవచ్చు.
న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్ 2025 వివరాలు ;
న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్ 2025 లో భాగంగా (Jio New Year 2025 plans) యూజర్లు రూ.2,025 రీఛార్జ్ చేసుకుంటే... కాల్, డేటా, SMS, జియో యాప్‌ల ప్రయోజనాలతోపాటు షాపింగ్, పుడ్ డెలివరీ యాప్, ట్రావెల్ కూపన్ లను పొందవచ్చు. జియో న్యూ ఇయర్ ఆఫర్ డిసెంబర్ 11 నుంచే ప్రారంభం కాగా.. జనవరి 11 వ తేదీ వరకు గడువు ఉందని జియో తెలిపింది.

200 రోజుల వ్యాలిడిటీ :
జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ లో భాగంగా రూ.2025 ప్లాన్ తో (Jio RS2025 Recharge Plan) రీఛార్జ్ చేసుకున్న యూజర్లు 200 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.
500GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా :
డేటా పరంగా రోజువారీ 2.5GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అంటే మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో ఏకంగా 500GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా సుమారు రూ.400 పైగా సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.349 రీఛార్జ్ ప్లాన్ ఈ ప్రయోజనాలను అందిస్తోంది.
రూ.2,150 విలువైన కూపన్ లు ఉచితం :
దీంతోపాటు జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ 2025 ప్లాన్ లో (Jio New Year Plans 2025) భాగంగా రూ.2,150 విలువైన కూపన్ లను పొందవచ్చు. ఇందులో రూ.500 AJio కూపన్, రూ.150 స్విగ్గీ కూపన్, రూ.1500 విలువైన ఈజ్ మై ట్రిప్ కూపన్ లను పొందవచ్చని జియో పేర్కొంది.
ఈజ్ మై ట్రిప్‌లో ఫ్లైట్ టికెట్‌ల బుకింగ్‌పై రూ.1500 విలువైన కూపన్‌ను వినియోగించుకోవచ్చు. మరియు రూ.2500 లేదా ఆపై కొనుగోళ్లకు రూ.500 Ajio కూపన్‌ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు స్విగ్గీలో రూ.499 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై రూ.150 విలువైన కూపన్ ద్వారా డిస్కౌంట్‌ను పొందవచ్చు. జియో యాప్, వెబ్‌సైట్, రిటైలర్ వద్ద చేసుకొనే రీఛార్జ్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. జనవరి 11 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications