Home
News

జియో 8వ వార్షికోత్సవ ఆఫర్‌.. ఈ రీఛార్జ్‌లపై రూ.700 వరకు ప్రయోజనాలు పొందవచ్చు..!

ప్రముఖ టెలికాం దిగ్గజం జియో (jio) కీలక ప్రకటన చేసింది. సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన రీఛార్జ్‌లపై రూ.700 విలువైన ప్రయోజనాలు అందించనున్నట్లు వెల్లడించింది. అదనపు డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌, జొమాటో మెంబర్‌షిప్‌ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం జియో 49 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఎంపిక చేసిన రీఛార్జ్‌ ప్లాన్‌లపై మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

జియో రూ.899, రూ.999, రూ.3599 రీఛార్జ్‌ ప్లాన్‌లపై మాత్రమే ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చని జియో వెల్లడించింది. సెప్టెంబర్‌ 5 నుంచి 10 వ తేదీలోపు రీఛార్జీ చేసుకున్నవారికి (Jio 8th Anniversary Offer) మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని జియో తన ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు.

Jio announces special offer

జియో 8వ వార్షికోత్సం సందర్భంగా ఎంపిక చేసిన మూడు రీఛార్జ్‌లపై రూ.175 విలువైన వోచర్‌ను పొందాతారు. ఈ వోచర్‌ పై 28 రోజులపాటు 10 OTT సబ్‌స్క్రిప్షన్‌, 10GB డేటాను కూడా పొందవచ్చు. దీంతోపాటు మూడు నెలలపాటు జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. రూ.500 Ajio వోచర్‌ కూడా అందిస్తామని జియో తన ప్రకటనలో తెలిపింది. రూ.2999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసినప్పుడు ఈ వోచర్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

జియో రూ.899 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అదే రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS, 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది.

అదే జియో రూ.3599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2.5GB డేటా మరియు 100 SMSలను పొందవచ్చు. అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు.

గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ ఛైర్మన్‌ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. దీపావళి నుంచి AI క్లౌడ్‌ స్టోరేజీ సేవలను అందించనున్నట్లు తెలిపారు. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద జియో యూజర్లకు 100GB ఉచిత స్టోరేజీ అందిస్తామన్నారు. వీడియోలు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లు సహా ఇతర కంటెంట్‌ను భద్రపరచుకొనేందుకు క్లౌడ్‌ స్టోరేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

దీంతోపాటు ఈ వార్షిక సమావేశంలో జియో ఫోన్‌కాల్‌ AI ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫీచర్‌ ఫోన్‌ కాల్‌ సంభాషణలను రికార్డు చేస్తుందని తెలిపారు. ఈ రికార్డింగ్‌లు జియో క్లౌడ్‌లో స్టోర్‌ చేస్తుందన్నారు. వీటిని Text రూపంలోకి మారుస్తుందని, అవసరం అయితే ఇతర భాషల్లోనికి కూడా అనువాదం చేస్తుందని వెల్లడించారు. దీంతోపాటు జియో బ్రెయిన్‌ సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Jio announces special offers on recharge plans on its 8th anniversary full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X